school to be re open in july

దేశవ్యాప్తంగా జూలైలో స్కూళ్లు ప్రారంభం, మార్గదర్శకాలు ఇవే

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కరోనా కట్టడి కోసం విధించిన లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా విద్యా సంస్థలు మూతపడిన సంగతి తెలిసిందే.

కరోనా కట్టడి కోసం విధించిన లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా విద్యా సంస్థలు మూతపడిన సంగతి తెలిసిందే. స్కూళ్లు, కాలేజీలు అన్ని బంద్ అయ్యాయి. పరీక్షలు జరక్కుండానే స్కూళ్లు మూతపడిన విషయం తెలిసిందే. దీంతో కొన్ని రాష్ట్రాల్లో పరీక్షలు నిర్వహించకుండానే 1 నుంచి 9వ తరగతి విద్యార్థులను పాస్ చేస్తూ ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో టెన్త్ పరీక్షలకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, అసలు స్కూళ్లు ఎప్పుడు తెరుచుకుంటాయి? పిల్లలు మళ్లీ బడి పాట పట్టేదెప్పుడు? ఇంకా ఎన్ని రోజులు సమయం పడుతుంది? ఇలాంటి ప్రశ్నలు అటు విద్యార్థులను ఇటు తల్లిదండ్రులను, టీచర్లను వేధిస్తున్నాయి. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా స్కూళ్లు రీఓపెన్ పై కేంద్రం ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.

స్కూళ్లు తెరిచేది జూలైలో:
కరోనా నేపథ్యంలో మూతబడ్డ స్కూల్స్ జూలైలో తెరిచే అవకాశముందని సమాచారం. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం యోచన చేస్తోందట. అందుకు అనుగుణంగా విధి విధానాలు రూపొందిస్తోంది. తొలుత గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లలోని పాఠశాలల్ని తెరవాలని కేంద్రానికి పలు ప్రతిపాదనలు వచ్చినట్టు సమాచారం. 30 శాతం హాజరుతో 8, ఆపై తరగతుల విద్యార్థులను మాత్రమే స్కూళ్లకు అనుమతించనున్నట్టు తెలుస్తోంది. ప్రైమరీ తరగతుల (ఒకటి నుంచి ఏడో తరగతి) విద్యార్థులు చిన్న వయసు వారు కావడంతో తరగతి గదుల్లో, పాఠశాల ఆవరణలో పిల్లలు భౌతిక దూరాన్ని పాటించడం కష్టం కాబట్టి వారికి ఇప్పట్లో స్కూల్స్ తెరిచే అవకాశం లేదని సమాచారం. స్కూల్స్ పునఃప్రారంభం, సంబంధించిన మార్గదర్శకాలు వచ్చే వారం ప్రభుత్వం ప్రకటించే అవకాశముంది.

* ఆరెంజ్, గ్రీన్‌జోన్లలో స్కూళ్లను తొలుత ఆరంభిస్తారు.
* పెద్ద క్లాసుల విద్యార్థులకు తొలుత స్కూళ్లను తెరుస్తారు. 
* 8వ తరగతిలోపు విద్యార్థులు పూర్తి స్థాయిలో స్కూళ్ల ఓపెన్ వరకూ వేచి చూడాల్సి ఉంటుంది. 
* పిన్న వయస్కులైన విద్యార్థులు నిబంధనలను పాటించడం కష్టం. 
* దీనిని దృష్టిలో పెట్టుకుని వారి భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ వారిని ఇంటికే పరిమితం చేస్తారు. 
* అయితే వారు ఇళ్ల నుంచే ప్రస్తుతానికి విద్యాభ్యాసం చేసేలా ఏర్పాట్లు ఉంటాయి.

స్కూల్స్ రీఓపెన్ చేశాక పాటించాల్సిన మార్గదర్శకాలు ఇలా ఉండొచ్చు:
* కొన్ని రోజులపాటు ప్రార్థనలు జరగవు
* రెండు షిఫ్టుల్లో తరగతుల నిర్వహణ
* టీచర్లు ముఖానికి మాస్కులు, చేతులకు గ్లౌజ్‌లను ధరించాలి 
* ప్రతి స్కూల్‌లో థర్మల్‌ స్క్రీనింగ్‌ వ్యవస్థ 
* ముగ్గురు కూర్చునే బల్లపై ఇద్దరు విద్యార్థులు మాత్రమే కూర్చోవాలి. 
* భౌతిక దూరం వంటి నియమాలు పర్యవేక్షించేందుకు సీసీటీవీతో రికార్డు
* పాటించాల్సిన నిబంధనల్ని ముద్రించి పాఠశాల, సబ్‌ డివిజనల్‌ మెజిస్ట్రేట్‌, డివిజనల్‌ మెజిస్ట్రేట్‌ కార్యాలయాల్లో ఉంచాలి.

రెండు షిఫ్టుల్లో క్లాసుల నిర్వహణ:
కరోనా వైరస్ భయాలతో మార్చి 16 నుంచి స్కూళ్లు మూతపడ్డాయి. రెండు నెలలు స్కూళ్లు పని చేయకపోవడంతో ఇవి ఎప్పుడు తిరిగి తెరుచుకుంటాయనేది దేశవ్యాప్తంగా ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశం అయింది. సాధారణంగా వేసవి సెలవుల తరువాత జూన్‌లోనే స్కూళ్లు తెరవాల్సి ఉంటుంది. అయితే వీటిని జులైలో రెండు షిప్టుల పద్ధతిలో తిరిగి తెరుస్తారని స్పష్టమైంది. విద్యార్థులు పాటించాల్సిన అనంతర విధివిధానాలను ముందుగా టీచర్లు తెలుసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థులు, టీచర్ల ప్రాణాలు, వారి ఆరోగ్య భద్రత తమకు ముఖ్యమని కేంద్రం స్పష్టం చేసింది.

వెంటాడుతున్న కరోనా భయం:
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ప్రతి రోజూ వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో కరోనా తీవ్రత మరీ ఎక్కువగా ఉండనుందని నివేదికలు చెబుతున్నాయి. వ్యాక్సిన్ వచ్చే జాగ్రత్తలు పాటించడం తప్ప మరో మార్గం లేదు. ఈ క్రమంలో స్కూల్స్ రీఓపెన్ విషయంలో తొందరపడకూడదని కేంద్రం యోచిస్తోంది. ఆచూతూచి అడుగులు వేయాలని నిర్ణయించింది. ఏమాత్రం పొరపాటు చేసినా పిల్లల ప్రాణాలు రిస్క్ లో పడతాయి. అందుకే పక్బడందీ చర్యలతో స్కూల్స్ రీఓపెన్ చేయాలన్నది కేంద్రం యోచన.

Read: టెన్త్.. కొత్త ఎగ్జామ్ సెంటర్లపై మెసేజ్‌లు

Related Posts