లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

డిసెంబర్ 31 దాకా ముంబై లో స్కూళ్లకు సెలవు

Published

on

schools-in-mumbai-to-remain-closed-till-december-31

Schools in Mumbai to remain closed till Decmber 31 : మహారాష్ట్ర రాజధాని ముంబైలో కోరనా కేసులు పెరుగుతున్నందున డిసెంబర్ 31వ తేదీ వరకు పాఠశాలలను మూసి వేయనున్నారు. బృహన్ ముంబై మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో నడిచే పాఠశాలలను డిసెంబర్ 31వ తేదీ వరకు మూసి వేస్తున్నట్లు ముంబై మేయర్ కిశోరి పడ్నేకర్ తెలిపారు.

వాలంటీర్ గా “కోవాగ్జిన్” ట్రయిల్ టీకా వేయించుకున్న మంత్రివాస్తవానికి నవంబర్ 23 నుంచి స్కూళ్లు తెరవాల్సి ఉంది. అయితే బీఎంసీ పరిధిలో ఉండే స్కూళ్లకు మాత్రం ఆంక్షలను పెంచేశారు. ముంబైలో కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో మేయర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.దాదాపు 8 నెలల తర్వాత మహారాష్ట్రలో పాఠశాలలను పునః ప్రారంభించటానికి ప్రభుత్వం సిధ్దమయ్యింది. నవంబర్ 23 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్లు తెరుచుకోనున్ననాయి కానీ ముంబై లో మాత్రం స్కూళ్లకు డిసెంబర్ 31 వరకు సెలవలు ప్రకటించారు. 9నుంచి 12వ తరగతి విద్యార్ధులకోసం రాష్ట్రంలోని మిగతా పాఠశాలలు తెరుచుకుంటున్నాయి. కాగా సోమవారం నుంచి పాఠశాలలు తెరవటానికి యాజమాన్యాలు పాఠశాలలను శానిటైజేషన్ చేయిస్తున్నాయి.
స్కూళ్లకు వచ్చేవిద్యార్ధులు కోవిడ్ నిబంధనలు పాటించేలా పాఠశాలల్లో శానిటైజర్లు సిధ్ధంగా ఉంచుతున్నారు. విద్యార్ధులు మాస్క్ లు తప్పని సరిగా ధరించేలా చర్యలు చేపడుతున్నారు. స్కూలుకు హజరయ్యే ముందు ఉపాధ్యాయులందరూ కోవిడ్ టెస్ట్ చేయించుకుని నెగెటివ్ రిపోర్టు వచ్చిన వారు మాత్రమే విధులకు హజరవ్వాలని విద్యాశాఖ అదేశాలు జారీ చేసింది. విద్యార్దులు కూడా క్లాస్ రూమ్ లో భౌతిక దూరం పాటిస్తూ కూర్చునేలా ఏర్పాట్లు చేయాలని విద్యా శాఖమంత్రి వర్షాగైక్వాడ్ ఆదేశించారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *