సోమవారం నుంచే స్కూళ్లు రీఓపెన్.. పిల్లలను క్లాసులకు పంపుతున్నారా? కోవిడ్ నిబంధనలు తప్పక తెలుసుకోండి!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కరోనా పరిస్థితుల మధ్య దేశంలో స్కూళ్లు తెరుచుకోబోతున్నాయి.. సోమవారం (సెప్టెంబర్ 21) నుంచి రాష్ట్రాలవారీగా అన్ని స్కూళ్లు తిరిగి తెరుచుకోనున్నాయి. Unlock 4లో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశంలోని అన్ని రాష్ట్రాలకు స్కూళ్లు తెరిచేందుకు అనుమతినిచ్చింది. కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలదే తుదినిర్ణయం కానుంది.. సెప్టెంబర్ 21 నుంచి స్కూళ్లు రీఓపెన్ చేయాలా? వద్దా నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలేసింది.

దేశ రాజధాని ఢిల్లీ సహా ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ సహా పలు రాష్ట్రాల్లో కరోనా కేసుల తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. ఈ రాష్ట్రాల్లో మాత్రం సోమవారం నుంచి స్కూళ్లు తెరవకూడదని ప్రకటించాయి. వచ్చే వారం నుంచి అసోం, కర్ణాటక సహా కొన్ని రాష్ట్రాల్లో స్కూళ్లు తెరుచుకోనున్నాయి. కేంద్ర హోం శాఖ, కుటుంబ వ్యవహారాల శాఖ జారీ చేసిన Unlock 4 మార్గదర్శకాల ప్రకారం.. స్కూళ్లలో 50 శాతం టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్‌తోనే బోధనతోనే తెరిచేందుకు అనుమతి ఉంది.విద్యార్థుల్లో 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు మాత్రమే స్కూళ్లకు అనుమతి ఉంది. కచ్చితంగా స్వచ్ఛంద ప్రాతిపాదికన మాత్రమే అనుమతి ఉంటుంది . సోమవారం నుంచి స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు తమ తల్లిదండ్రుల నుంచి సమ్మతి పత్రాన్ని స్కూళ్లలో సమర్పించాల్సి ఉంటుంది. కంటైన్మెంట్ జోన్లలో ఉండే విద్యార్థులు లేదా టీచర్లు ఎవరైనా సరే వచ్చే వారం నుంచి స్కూళ్లకు వెళ్లేందుకు అనుమతి లేదు.

స్కూళ్లలో కరోనా వైరస్ నివారణ చర్యలతో పాటు సామాజిక దూరం, ముఖానికి తప్పనిసరిగా మాస్క్ ధరించడం, చేతులను శానిటైజింగ్ తో కడుక్కోవడం తప్పనిసరిగా పాటించాలి. స్కూళ్లలో ప్రవేశ ద్వారం దగ్గర తప్పనిసరిగా థర్మల్ స్కానర్లు, బాడీ టెంపరేచర్ చెక్ చేసేలా అన్ని ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. సాధ్యమైనంత వరకు స్కూళ్లలోకి ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లను ఏర్పాటు చేసుకోవాలని మంత్రిత్వ శాఖ సూచనలు చేసింది. స్కూళ్లన్నీ వర్చువల్ క్లాసులను కొనసాగించాలని సూచించింది.ఏయే రాష్ట్రాల్లో స్కూళ్లు తెరుస్తున్నారంటే :
సోమవారం నుంచి 9వ తరగతి నుంచి 12వ తరగతి విద్యార్థులకు మాత్రమే తరగతులను నిర్వహించనుంది అసోం ప్రభుత్వం. 15 రోజుల తర్వాత ప్రభుత్వం దీనిపై మరోసారి సమీక్ష జరుపనుంది. హరియాణాలో మాత్రం స్కూళ్లు మూసే ఉంటాయి.. కానీ, స్కూళ్లలో ఏదైనా గైడెన్స్ కోసం రావొచ్చునని తెలిపింది. హిమాచల్ ప్రదేశ్‌లో సోమవారం నుంచి స్కూళ్లు తెరుచుకోనున్నాయి. వచ్చే వారం నుంచి కర్ణాటకలో కూడా పాక్షికంగా స్కూళ్లను ఓపెన్ చేయనున్నాయి.

సీనియర్ విద్యార్థులు మాత్రమే స్కూళ్లకు వెళ్లేందుకు అనుమతి ఉంది. అది కూడా గైడెన్స్ కోసమేనట.. చండీగఢ్ లో కూడా పాక్షికంగా స్కూళ్లు ఓపెన్ కానున్నాయి. ఒక్కో తరగతి గదిలోకి కేవలం 15 మంది విద్యార్థులను అనుమతించనున్నారు. ప్రతి రెండు గంటలకు ఒక బ్యాచ్ గా విద్యార్థులు తరగతి గదులకు హాజరు కావాల్సి ఉంటుంది.ఈ సమయంలో అర్థ గంట మధ్య ఆయా తరగతి గదులను శానిటైజ్ చేయనున్నారు. వచ్చే అక్టోబర్ 5 వరకు స్కూళ్లు మూసే ఉంటాయని ఢిల్లీ ప్రభుత్వం ఒక ప్రకటనలో వెల్లడించింది. వచ్చే వారం నుంచి గుజరాత్, ఉత్తరప్రదేశ్, కేరళ, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు స్కూళ్లను తెరవడం లేదని ప్రకటించాయి.

Related Posts