కరోనా కొత్త ర్యాపిడ్ టెస్టు.. 5 నిమిషాల్లోపే ఫలితం!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

coronavirus test : కరోనా వైరస్ నిర్ధారించే కొత్త ర్యాపిడ్ టెస్టు వచ్చేసింది.. ఈ టెస్టు ద్వారా కేవలం 5 నిమిషాల కన్నా తక్కువ వ్యవధిలోనే కరోనా (Covid-19) నిర్ధారణ చేయొచ్చు. కరోనా కొత్త ర్యాపిడ్ టెస్టును Oxford Universityకి చెందిన సైంటిస్టులు డెవలప్ చేశారు. ఈ టెస్టు ద్వారా influenza, SARS-CoV-2 వంటి అనేక వైరస్ లను గుర్తించవచ్చు.ఈ టెస్టును పరిశోధకుడు Nicolas Shiaelis నేతృత్వంలో అభివృద్ధి చేశారు. కరోనావైరస్ కేసులను సాధ్యమైనంత తొందరగా గుర్తించేందుకు ఈ టెస్టును అభివృద్ధి చేయగా.. కేవలం 5 నిమిషాల కంటే తక్కువ సమయంలోనే కోవిడ్ నిర్ధారణ చేయొచ్చునని సైంటిస్టులు పేర్కొన్నారు. కరోనా నిర్ధారణ కోసం ఈ ర్యాపిడ్ టెస్టును గొంతులోని స్వాబ్ (లాలాజలం) ద్వారా పరీక్షిస్తారు.ఇందులోని చిన్న ఫ్లోరోసెంట్ DNA తంతువులతో వైరస్ కణాలను వేగంగా గుర్తిస్తుంది.  మిషన్ లెర్నింగ్ సాఫ్ట్ వేర్ ద్వారా శాంపిల్స్‌లో కరోనా వైరస్ ఉందో లేదో గుర్తించేందుకు ముందుగా మైక్రోస్కోపు ద్వారా కరోనా శాంపిల్స్ నుంచి ఇమేజ్‌లను సేకరించవచ్చు.Oxford’s Department of Physicsలోని ప్రొఫెసర్ Achilles Kapanidis చెప్పిన ప్రకారం.. ఇతర ర్యాపిడ్ టెస్టుల్లో కరోనా శాంపిల్స్ నుంచి వైరస్ నిర్ధారణ చేయడం ఆలస్యమవుతోందని, ఖరీదు ఎక్కువగా ఉండటం, శాంపిల్స్ నిర్ధారణకు ఎక్కువ సమయం తీసుకోవడం అనేక ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు.అదే ఈ కొత్త ర్యాపిడ్ టెస్టు ద్వారా క్షణాల వ్యవధిలో కరోనా నిర్ధారణ చేయొచ్చునని చెప్పుకొచ్చారు. సంగీత వేదికలు, ఎయిర్ పోర్టులు, వ్యాపార ప్రదేశాల్లో ర్యాపిడ్ టెస్టులు చేసుకోవచ్చు. అందుకు వీలుగా ఈ టెస్టుకు అంతర్గత డివైజ్ డెవలప్ చేసేందుకు రీసెర్చర్లు ఇప్పుడు ప్లాన్ చేస్తున్నారు. 2021 మధ్య ఏడాదిలోగా ఈ ర్యాపిడ్ టెస్టు రెడీ అయ్యే అవకాశం ఉందంటున్నారు.

Related Posts