సాధారణ వజ్రాలు కాదండోయ్.. కృత్రిమ వజ్రాలంట!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

artificial diamonds room temperature : ప్రకృతి ఒడిలో దొరికే వజ్రాలు బిలియన్ల ఏళ్ల క్రితమే భూగర్భంలో ఆవిర్భవించాయంటున్నారు. తీవ్రమైనే వేడి, పీడనంతో కూడిన పరిస్థితుల్లో వజ్రాలు పుట్టుకొస్తాయి.భూ ఉపరితలం నుంచి 150 కిలోమీటర్ల నుంచి 200 కిలోమీటర్ల లోతు (93-124 మైళ్లు)లో సాధారణంగా వజ్రాలు ఉద్భవిస్తుంటాయి. భూగర్భంలో అక్కడి ఉష్ణోగ్రతలు సగటున 900 నుంచి 1,300 డిగ్రీల సెల్సీయస్ (1650 నుంచి 2370) డిగ్రీల ఫారన్ హీట్ వరకు ఉంటుంది.

ఆ ఉపరితలంపై 50వేల రెట్లు పీడనం ఉంటుంది. ఇలాంటి వజ్రాలపై అందరికి ఎందుకింత ఆపేక్ష ఉంటుందంటే? వజ్రాలను రూపొందించాలంటే ప్రత్యేకమైన పరిస్థితుల్లో కొన్ని మిలియన్ల ఏళ్ల సమయం పడుతుంది.కానీ, ఇప్పుడు ఆస్ట్రేలియాలోని సైంటిస్టులు మాత్రం కొన్ని నిమిషాల్లోనే వజ్రాలను తయారు చేసేస్తున్నారు. అది కూడా గది ఉష్ణోగ్రత పరిస్థితుల్లో సులభంగా కృత్రిమ వజ్రాల (ఆర్టిఫీషియల్ డైమండ్స్)ను తయారు చేస్తున్నారు.

వజ్రాలనేవి చాలా అరుదుగా లభిస్తుంటాయి. అందుకే పురావాస్తు శాస్త్రవేత్తలు.. ఆర్టిఫీషియల్ డైమండ్లను క్రియేట్ చేసేందుకు పద్ధతులను డెవలప్ చేయాలంటున్నారు.

1950లో స్వీడన్, అమెరికా సైంటిస్టులు ఎట్టకేలకు గ్రాఫైట్, మోల్టెన్ ఐరన్ లను సింథటిక్ డైమండ్ లోకి ఎలా మార్చాలో కనిపెట్టారు.సింథటిక్ డైమండ్లను క్రియేట్ చేసేందుకు తమ పరిశ్రమలో వాడే అత్యంత సాధారణ పద్ధతి అత్యధిక ఒత్తిడి, అత్యధిక ఉష్ణోగత్ర (HPHT). ఈ HPHT, కార్బన్ సమ్మేళనం (హై టెంపరేచర్, హై ప్రెజర్, కార్బన్)తో కూడిన పదార్థమే బిలియన్ల ఏళ్ల క్రితం డైమండ్లలోకి రూపాంతరం చెందాయని అంటున్నారు.

మెల్ బోర్న్‌లో ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్శిటీ (ANU), RMIT యూనివర్శిటీకి చెందిన భౌతిక శాస్త్రవేత్తలు కొత్త అధ్యయనాన్ని నిర్వహించారు. ఇందులో రెండు రకాల డైమండ్లను క్రియేట్ చేశారు.ఒక డైమండ్.. జ్యుయెలరీలో ఉపయోగించే వజ్రం మాదిరిగానే ఉంటుంది. మరో వజ్రం.. మెట్రో లైట్స్ రూపొందించిన Lonsdaleite కంటే చాలా ధృడంగా ఉంటుంది.

ఈ రెండు రకాల పద్ధతులు అద్భుతమైనవే.. ఎందుకంటే ఈ ఆర్టిఫీషియల్ డైమండ్లను గది ఉష్ణోగ్రతతో కూడిన ల్యాబరేటరీలో క్రియేట్ చేసి భారీ విజయాన్ని సాధించారు.

ప్రత్యేకించి.. ఈ అరుదైన Lonsdaleite వెరైటీ వజ్రాలు 58శాతం సాధారణ డైమండ్ల కంటే చాలా గట్టిగా ఉంటాయి. అయినప్పటీకీ ఈ కృత్రిమ డైమండ్లకు అపారమైన పీడనాన్ని సైంటిస్టులు జోడించనున్నారు.అంటే.. ఒక బ్యాలెట్ షూపై 640 అఫ్రికన్ ఏనుగులు బ్యాలెన్స్ చేస్తే కలిగే పీడనానికి సరిసమానంగా ఉంటుందంట.. అంత పీడనాన్ని అప్లయ్ చేయనున్నారు.

అసలు అసలు పీడనాన్ని ఎలా అప్లయ్ చేస్తారో తెలుసా? ఇదే ట్విస్ట్.. అని ANU ప్రొఫెసర్ జోడి బ్రాడ్ బై హింట్ ఇచ్చారు.కార్బన్ ఆటోమ్స్ అధిక పీడన పరిస్థితుల్లో ఒక చోటకు కదిలించినప్పుడు రెగ్యులర్ డైమండ్ మాదిరిగానే Lonsdaleite డైమండ్ ఏర్పడుతుంది.

దీన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ కింద పెడతారు. ఆ విధంగా డైమండ్ ఎలా ఏర్పడిందో అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తారు.ఆర్టిఫీషియల్ డైమండ్లు జ్యుయెలరీని అర్థం కాదు.. వాస్తవానికి ఈ డైమండ్లను ఇండస్ట్రీ అప్లికేషన్ల కోసం వినియోగిస్తుంటారు.

లోహపు వంటి గట్టి వస్తువులను సరైన ఆకృతిలోకి మార్చేందుకు ఈ డైమండ్లతోనే ముక్కలుగా కటింగ్ చేస్తుంటారు.

ఎక్కువగా మైనింగ్ సైట్లలో అల్ట్రా సాలీడ్ మెటేరియల్స్ కటింగ్ చేసేందుకు ఈ Lonsdaleite అనే డైమండ్ ను వినియోగిస్తుంటారుని బ్రాడ్ బై ఒక ప్రకటనలో తెలిపారు.

Related Tags :

Related Posts :