లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

International

తాగే నీరే సూసైడ్‌లను నియంత్రించగలదు.. ఆ ఒక్కటి కలిపితే చాలు

Published

on

బహుశా.. 1929 ఆ కాలంలో 7up అమ్మేటప్పుడు వాళ్లు వేసిన ప్లాన్ కరెక్టే కావొచ్చు. ఎందుకంటే యువతలో సూసైడ్ రేట్ తగ్గించాలంటే ఇది ప్రత్యేకంగా పనిచేస్తుంది. బ్రైటన్ అండ్ సస్సెక్స్ మెడికల్ స్కూల్ వారు బ్రిటిష్ జర్నల్ ఆఫ్ సైకియాట్రి అనే కథనంలో ఇలా వెల్లడించారు. కొన్ని ప్రదేశాల్లో తాగే నీటిలో లిథియం హై లెవెల్స్ లో నిక్షిప్తమై ఉంటుంది. ఆ ప్రాంతాల్లో ఉండేవారిలో ఆత్మహత్యలు చాలా తక్కువరేటులో ఉంటున్నాయి.‘తాగే నీటిలో లిథియమ్ లెవల్స్ ఎక్కువగా ఉంటే వారిలో సూసైడ్ చేసుకోవాలనే ఆలోచనలు చాలా తక్కువ సంఖ్యలో కనిపిస్తున్నాయి. తద్వారా కమ్యూనిటీ మెంటల్ హెల్త్ ఇంప్రూవ్ కావడానికి ఉపయోగపడుతుందని’ ఈ స్టడీ లీడ్ ప్రొఫెసర్ అంజుమ్ మెమన్ అంటున్నారు.

స్టడీలో భాగంగా ఆస్ట్రియా, గ్రీస్, ఇటలీ, లిథుయానియా, యూకే, జపాన్, యూఎస్ఏలో మూడు దశాబ్దాల పాటు కింగ్స్ కాలేజ్ లండన్ పరిశీలించింది. ఇందులో లిథియం సామర్థ్యాలు తెలుసుకునేందుకు సామూహికంగా ట్రయల్స్ నిర్వహించారు. మానసికపరమైన ఆరోగ్య స్థితులపై ఎంతవరకూ పనిచేస్తున్నాయో తెలుసుకున్నారు.మెదడుకు నీటి సరఫరా అందుతున్న సమయంలో కెమికల్ సరిపడకపోతే ఫిక్షన్ నావెల్ లో జరిగినట్లుగా సైన్స్ కూడా అంతుపట్టకుండా మనిషి మారిపోతున్నాడు. ఇది ఒక ప్రయోగం మాత్రమేనని సైంటిస్టులు చెబుతున్నారు.

ఇందులో తెలుసుకున్నది ఏమంటే, క్లినికల్ ట్రయల్స్ లో లిథియం సూసైడ్ ను, తన సంబంధిత ప్రవర్తనను తగ్గిస్తుంది. మూడ్ మారిపోతుండటం నుంచి కూడా బయటపడేస్తుంది. అది కూడా నీటిలో సహజంగా దొరకే లిథియం కారణంగానే. చాలా ప్రాంతాల్లో సూసైడ్లు జరుగుతున్న అన్నీ చోట్లా.. తాగే నీటిలో లిథియం కాన్సట్రేషన్ తక్కువగా ఉంది.

హద్దు దాటి సైంటిస్టులు ప్రయోగం చేసినందుకు వారిని నిందించాల్సిన అవసరం లేదు. లాక్ డౌన్ సమయంలో మన మెంటల్ హెల్త్ లో చాలా మార్పులు వచ్చాయి. సంవత్సరానికి 8లక్షల సూసైడ్లు జరుగుతుంటే అందులో 15నుంచి 29 సంవత్సరాల మధ్య వయస్కులే ఉంటున్నారు. COVID-19 కారణంగా వచ్చిన ఐసోలేషన్ తో పాటు ఆర్థికపరమైన ఒత్తిడే దీనికి కారణం.ఇది సహజంగా ఎలా ఏర్పడుతుందో సైంటిస్టులు కూడా చెప్పలేకపోతున్నారు. సిల్వర్-వైట్, మెటాలిక్ ఎలిమెంట్, నీటిలో మట్టి ద్వారా, సముద్రపు నీటి ద్వారా, కొండలు కరగడం ద్వారా, కూరగాయలు ధ్యాన్యాలు, నీటి సరఫరా ఇవేవైనా మనిషి మూడ్ ని మార్చేయొచ్చు. నెర్వ్ సెల్స్ పెరుగుదలను నియంత్రించవచ్చు.

ఈ స్టడీలో తాగే నీటిలో పర్టిక్యూలర్ డోస్ ప్రకారం.. పుట్టినప్పటి నుంచి లిథియం ఇస్తుంటే ఒక స్థాయికి వచ్చాక అది మానవ శరీరానికి సరిపడ సెట్ అయిపోతుంది. ఓ ట్రయల్ లో ఇలా చేశారు. లిథియం మైక్రో డోసెస్ ను నేరుగా శరీరంలోకి ఎక్కించారు. (400 మైక్రోగ్రామ్స్)ను మాజీ డ్రగ్ యూజర్లకు రోజూ ఇవ్వడం ద్వారా వారి మూడ్ మారింది.

ఇక నీటిలో లిథియం ఎలా దొరుకుతుందని డ్రగ్ హిస్టేరియన్ జరిపిన పరిశోధనలో ఫలితం ఆశ్చర్యంగా అనిపించిందట. క్యాడె డిస్కవరీ ఆఫ్ లిథియంలో ఇదొక మ్యాజిక్ అయాన్ అని.. ఇప్పటికీ పరిశోధన జరుగుతూనే ఉందని, ఎందుకంటే సహజంగా దొరికే కెమికల్, లిథియం ఎలా ఏర్పడుతున్నాయో తెలియడం లేదని చెప్పుకొచ్చాడు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *