కరోనా రాకుండా ఉండాలంటే…ఏ మాస్క్ బెటర్..శాస్త్రవేత్తలు ఏమంటున్నారు ?

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కరోనా..కరోనా..అందర్నీ భయపెడుతోంది. దీనిని కాపాడుకోవాలంటే..మూడు సూత్రాలు చెబుతున్నారు. మాస్క్, సోషల్ డిస్టెన్స్, శానిటైజ్ చేసుకోవడం. కానీ మాస్క్ ఏదీ ధరించాలి ? అనే దానిపై అందరిలో డౌట్స్ ఉన్నాయి. అన్ని రకాల మాస్క్ లు వైరస్ ను కట్టడి చేయవంటున్నారు శాస్త్రవేత్తలు.

అమెరికా డ్యూక్ యూనివర్సిటీ (Duke University) శాస్త్రవేత్తలు మాస్క్ లపై పరిశోధన జరిపారు. ఎలాంటి మాస్క్ ధరిస్తే..బాగుంటనే దానిపై స్టడీ చేశారు. లేజర్ సెన్సర్ డివైజ్ తో 14 రకాల మాస్క్ లను, ఫేస్ కవరింగ్స్ ను పోల్చి చూశారు. ఏ మాస్క్ ధరించిన సమయంలో తుంపర్లు (మాట్లాడినా, తుమ్మినా దగ్గినా) ఏ దిశలో పయనించాయో నిశితంగా గమనించారు. తుంపర్లను ఏ మాస్క్ అడ్డుకోన్నదో సరి చూశారు.

లేబర్ బీమ్, లెన్స్ మొబైల్ ఫోన్ కెమెరాతో మాస్క్ లను పరిశీలించారు. వైరస్ ను అరికట్టడంలో ఎన్ – 95 మాస్క్ లు బెటరని తేల్చారు. అయితే..ఈ మాస్క్ ల్లో వాల్వ్ లేనివి వాడాలన సూచిస్తున్నారు. ఈ మాస్క్ తో పాటు..త్రీ లేయర్ మాస్క్, కాటన్ పొలిప్రోలిన్ కాటన్ మాస్క్, టూ లేయర్ పొలిప్రోలిన్ ఏ ప్రాన్ మాస్క్ లు మంచివని చెబుతున్నారు.

కరోనా సోకే అవకాశాలు ఒకే విధంగా ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఇటీవలే వాల్వ్ లున్న ఎన్ – 95 మాస్క్ లు తుంపర్లను అడ్డుకోవడంలో విఫమవుతున్నాయని పరిశోధనల్లో తేలిందంటున్నారు. మాస్క్ విషయంలో ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా..రిస్క్ ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

Related Posts