లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

International

ట్రంప్ దాడులు చేయిస్తాడనే అనుమానంతో ఇజ్రాయెల్ అలర్ట్

Published

on

ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ తమ మిలటరీ బలగాలకు సిద్ధంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీచేసింది. అమెరికా ప్రెసిడెంట్ వైట్ హౌజ్ వదిలివెళ్లేలోపు మిలటరీ స్ట్రైక్ కు ఆదేశాలు ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది. బిడెన్ ప్రమాణ స్వీకారం జరిగే లోపు ఉండే సమయంలో ట్రంప్ నిర్ణయాలు ఎలా ఉండబోతాయోననే ఆందోళన పెరిగిపోయేలా చేసింది.

గత వారం న్యూయార్క్ టైమ్స్ ఓ కథనంలో.. ఇరాన్‌కు చెందిన యురేనియం నిల్వల గురించి దాడులు చేసే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుందని పేర్కొంది. నటాంజ్ లో సీనియర్ మెంబర్స్, నేషనల్ సెక్యూరిటీ టీంతో కలిసి మీటింగ్ లో పాల్గొన్నారని వెల్లడించింది.* ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ రిపోర్ట్ ఆధారంగా యురేనియం నిల్వలు పెరిగిపోతున్నాయని తెలుసుకున్న ట్రంప్.. ఈ అంశం లేవెనెత్తారు. టాప్ అఫీషియల్స్ అయిన ప్రెసిడెంట్ మైక్ పెన్స్, మైక్ పాపింయో సెక్రటరీ లు వద్దంటూ ఆ నిర్ణయానికి హెచ్చరించారు.

* కానీ, ట్రంప్ ఇరాన్ పై నేరుగా దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తుందని ఇంగ్లీష్ మీడియా చెప్తోంది.

* ఇజ్రాయెలీ మినిష్టర్ ఆఫ్ డిఫెన్స్ బెన్నీ గంజ్ రెండు వారాల్లో క్రిస్టోఫర్ మిల్లర్‌తో, ట్రంప్ డిఫెన్స్ సెక్రటరీతో రెండు సార్లు మాట్లాడారట. ఇరాన్, సిరియా డిఫెన్స్ కోఆపరేషన్ గురించి చర్చించారు.

* గత ఆదివారం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతాన్యహు సౌదీ అరేబియాలో ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ను కలిశారు. ఇందులో పేర్కొన్న ప్రధాన అంశాలపై ఇజ్రాబెల్ అధికారులు చర్చలు జరిపారు.

* పాంపియో ఇజ్రాయెల్ తో పాటు మరికొన్ని గల్ఫ్ దేశాల్లోనూ పర్యటించారు. పాంపియోతో పాటు ప్రయాణించిన స్టేట్ డిపార్ట్‌మెంట్ అఫీషియల్స్ రిపోర్టర్లతో మాట్లాడుతూ.. ఆప్షన్లన్నీ టేబుల్ పైనే ఉన్నాయని చెప్పారు.

* పాంపియో గల్ఫ్ లో ఉన్న సమయంలో యూఎస్ సెంట్రల్ కమాండ్ B-52 స్ట్రాటజిక్ బాంబర్స్ ఓ చిన్న నోటీస్ ఇచ్చి చాలా కాలం పాటు మిషన్ నడిపించారు.

* సీనియర్ ఇజ్రాయెల్ అధికారులు ఇరాన్ పై యూఎస్ దాడి జరపడానికి ముందే ముందస్తు హెచ్చరికలు వస్తాయని ఆశిస్తుంది. అప్పటికప్పుడు తాము ప్రిపేర్ అవడానికి సమయం ఉండదని ముందే అంచనా వేస్తున్నాయి. ఈ మేరకే ఆల్రెడీ తమ మిలటరీ భాగాలను అలర్ట్ చేసేస్తున్నాయి.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *