లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

International

జర్మనీలోని కాన్వెంట్ లో 76 మందికి కరోనా పాజిటివ్

Published

on

nons germany covid

Scores of nuns contract coronavirus at German convent : జర్మనీ లోని ఓ కాన్వెంట్లో 76 మంది క్రైస్తవ సన్యాసినులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఉత్తర జర్మనీలోని తుయిన్లోని ఒక కాన్వెంట్ లో మంగళవారం నాడు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో 76 మందికి పాజిటివ్ నిర్ధారణ కాగా, మరో 85 మందికి నెగెటివ్ వచ్చింది. మరి కొన్ని ఫలితాలు రావాల్సి ఉంది.

కరోనా పాజిటివ్ వచ్చిన వారికి కూడా స్వల్ప లక్షణాలే ఉన్నాయని ఎవరూ ఆస్పత్రిలో చేరాల్నిన అవసరం లేదని కాన్వెంట్ హెడ్ సిస్టర్. మరియా కార్డిస్ రీకర్ తెలిపారు. ఈ క్రైస్తవ సంస్ధ అనేక పాఠశాలలలు , బాలుర కోస వసతి గృహాలు నడుపుతోంది.కరోనా పరిస్ధితులు ఎలా ఉన్నప్పటికీ వసతి గృహాల్లో వైద్య సౌకర్యాలతో. తగిన జాగ్రత్తలు తీసుకుని పిల్లలకు సేవలందిస్తున్నామని ఆమె వివరించారు. గత శుక్రవారం మొదటి కరోనా కేసు గుర్తించిన తర్వాత వసతిగృహం, స్కూల్ మొత్తం శానిటైజ్ చేయించి అందరినీ క్వారంటైన్ లో ఉంచినట్లు ఆమె వివరించారు.1869లో స్ధాపించబడిన ది సిస్టర్స్ ఆఫ్ సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ సెయింట్ జార్జ్ సంస్ధ జర్మనీ, నెదర్లాండ్స్, యుఎస్ఎ, జపాన్, ఇండోనేషియా, బ్రెజిల్, తూర్పు తైమూర్, అల్బేనియా, ఇటలీ మరియు క్యూబా లలో ఆసుపత్రులు, వికలాంగుల సంస్థలు, నర్సింగ్ కాలేజీలు మరియు వృద్ధాశ్రమాలతో పాటు పాఠశాలలు కూడా నిర్వహిస్తోంది.


Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *