లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Crime

ఇంకా పరారీలోనే తహసీల్దార్ హసినబీ : కొత్త విషయం తెలిసి అధికారులు షాక్

20 రోజులు దాటిపోయింది. తహసీల్దార్ ఇంకా పరారీలోనే ఉంది. ఇప్పటివరకు ఏసీబీ అధికారులు ఆమె ఆచూకీ కనిపెట్టలేకపోయారు. ఆమె ఎక్కడ ఉంది, ఏం చేస్తోంది ఎవరికీ

Published

on

search on for gudur tahsildar sheik hasinaa bee

20 రోజులు దాటిపోయింది. తహసీల్దార్ ఇంకా పరారీలోనే ఉంది. ఇప్పటివరకు ఏసీబీ అధికారులు ఆమె ఆచూకీ కనిపెట్టలేకపోయారు. ఆమె ఎక్కడ ఉంది, ఏం చేస్తోంది ఎవరికీ

20 రోజులు దాటిపోయింది. తహసీల్దార్ ఇంకా పరారీలోనే ఉంది. ఇప్పటివరకు ఏసీబీ అధికారులు ఆమె ఆచూకీ కనిపెట్టలేకపోయారు. ఆమె ఎక్కడ ఉంది, ఏం చేస్తోంది ఎవరికీ తెలియదు. ఏపీలో  సంచలనం రేపిన కర్నూలు జిల్లా గూడూరు తహసీల్దార్ షేక్ హసినబీ వ్యవహారంలో ఇంతవరకు ఎలాంటి పురోగతి లేదు. రూ.4లక్షలు లంచం కేసులో తహసీల్దార్ హసినబీపై కేసు  నమోదైంది. అప్పటి నుంచి ఆమె పరారీలో ఉంది.

తన సోదరుడి ద్వారా లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కినట్లే చిక్కి తప్పించుకుంది హసినబీ. ఇంతకీ ఆమె ఎక్కడుంది? ఇన్ని రోజులుగా ఏం చేస్తోంది? అనేది ఆసక్తికరంగా మారింది. కనీసం ఫోన్ లో కూడా అందుబాటులోకి రావడం లేదు. ప్రభుత్వం ఇప్పటికే తహసీల్దార్ ను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. కాగా, తప్పించుకుని తిరుగుతున్న తహసీల్దార్ గురించి కొత్త విషయం తెలిసింది. తహసీల్దార్ హసినబీ హైకోర్టులో ముందస్తు బెయిల్ కు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసి అధికారులు షాక్ తిన్నారు.

గూడూరు తహసీల్దార్ షేక్ హసినబీ వ్యవహారం రాష్ట్రంలో సంచలనం రేపింది. ఓ పొలం వివాదం పరిష్కారానికి సంబంధించి గూడూరుకు చెందిన రైతు సురేష్ ని రూ.8 లక్షలు లంచం డిమాండ్ చేసింది హసినబీ. అయితే తాను అంత ఇచ్చుకోలేనని రూ.4 లక్షలు ఇస్తానని రైతు చెప్పాడు. దీనికి హసినబీ అంగీకారం తెలిపింది. అయితే లంచం డబ్బుని తనకు నేరుగా ఇవ్వకుండా తన మనిషికి ఇవ్వాలని తహసీల్దార్ చెప్పింది. రైతు సరే అన్నాడు. నవంబర్ 7న తన సోదరుడు మహబూబ్ బాషాను పాణ్యంకి పంపింది తహసీల్దార్. కాగా లంచం ఇవ్వడం ఇష్టంలేని రైతు ఏసీబీని ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు.. పాణ్యం బస్టాండ్ లో లంచం తీసుకుంటుండగా బాషాని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.  అతడిని విచారించగా తహసీల్దార్‌ తనని పంపించినట్లు ఏసీబీ అధికారులకు బాషా చెప్పాడు. అతడి నుంచి రూ.4 లక్షలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్  పారిపోయింది. హసినబీ కోసం అధికారులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఆమె ఉంటున్న హాస్టల్ రూమ్ లలో సోదా చేసినా ఆచూకీ దొరకలేదు. కాగా, ఏకంగా 5 హాస్టల్ రూమ్ లు అద్దెకు తీసుకుని ఆమె ఉంటున్నట్లు తెలుసుకుని అధికారులు ఆశ్చర్యపోయారు.

హసినబీ అనంతపురంలో ఉన్నట్లు సమాచారం అందడంతో అధికారులు అక్కడా సోదాలు నిర్వహించారు. స్థానిక సీ క్యాంపులోని కొత్తపల్లి ఎంపీడీవో గిడ్డయ్య ఇంట్లో ఆమె ఉన్నట్లు తెలిసి కొన్ని  రోజుల క్రితం ఆకస్మిక తనిఖీలు చేశారు. కానీ లాభం లేకపోయింది. అప్పటికే గిడ్డయ్య సైతం నెల రోజులు మెడికల్ లీవ్ పెట్టి వెళ్లిపోయినట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం వీరి కోసం గాలింపు సాగుతోంది.

కాగా, ఈ కేసు విచారణలో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. ముందస్తు బెయిల్ అంశం బయటపడింది. ముందస్తు బెయిల్ కోసం హసినబీ కోర్టుని ఆశ్రయించినట్టు తెలిసింది. నేరుగా లంచం తీసుకుంటూ దొరకలేదు కాబట్టి.. ముందస్తు బెయిల్ కు దరఖాస్తు చేసుకో అంటూ హసినబీకి సన్నిహితంగా ఉండే ఇద్దరు తహసీల్దార్లు ఉచిత సలహాలిచ్చినట్లు అధికారులు కనుగొన్నారు. వెంటనే వారిని పిలిపించి రెండు రోజుల పాటు ఏసీబీ అధికారులు ప్రశ్నించారని సమాచారం. ఈ క్రమంలోనే హసినబీ హైకోర్టులో ముందస్తు బెయిల్ కు దరఖాస్తు చేసుకున్నట్లు బయటపడింది. కాగా, బెయిల్ మంజూరు చేయొద్దంటూ ఏసీబీ అధికారులు కోర్టును కోరారు. హసినబీకి మరో మార్గం లేదని.. ఏసీబీ డీఎస్పీ లేదా ఏసీబీ కోర్టులో లొంగిపోవాల్సిందే అని అధికారులు చెబుతున్నారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *