Search Results Web results  BSNL launches free of cost 'Work from Home' broadband plan

కరోనా ఎఫెక్ట్: బీఎస్‌ఎన్‌ఎల్ ఆఫర్.. ఉచితంగా హైస్పీడ్ ఇంటర్నెట్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

అండమాన్ మరియు నికోబార్ సర్కిల్‌తో సహా అన్ని సర్కిల్‌లలో బ్రాడ్‌బ్యాండ్ కస్టమర్లందరికీ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ‘వర్క్ @హోమ్’ ను ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్రవేశపెట్టింది. కరోనావైరస్ వ్యాప్తిని అడ్డుకోవాలంటే ప్రజలు ఇంటి నుంచే పని చేయ్యాలని ఈ సమయంలో బిఎస్‌ఎన్‌ఎల్ తన ల్యాండ్‌లైన్ వినియోగదారులను బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులుగా మార్చుకునేందుకు ఈ ఆఫర్ ప్రకటించింది.

ఎయిర్‌టెల్, జియో వంటి ప్రైవేట్ ప్రొవైడర్లు.. ఇతర ఇంటర్నెట్ సర్వీసు ప్రొవైడర్లతో పోటీ పడటానికి ఈ ఆఫర్ సాయపడుతుందని సంస్థ భావిస్తుంది. “కరోనావైరస్(కోవిడ్-19)ని అరికట్టేందుకు ప్రభుత్వం అనుసరిస్తున్న వివిధ విధానాల్లో ఇంటి నుంచి వర్క్ చెయ్యడాన్ని ప్రోత్సహించడానికి బిఎస్ఎన్ఎల్ తన కార్యక్రమాన్ని ప్రకటించింది” అని బిఎస్ఎన్ఎల్ బోర్డు డైరెక్టర్ సీఎఫ్ఏ వివేక్ బంజాల్ చెప్పారు.

బిఎస్‌ఎన్‌ఎల్ ల్యాండ్ లైన్ ఉన్న, బ్రాడ్‌బ్యాండ్ లేని దేశవ్యాప్తంగా ఉన్న పౌరులందరికీ బ్రాడ్‌బ్యాండ్ సేవను ఒక నెల పాటు ఉచితంగా అందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రమోషనల్ వ్యవధి ముగిసిన తరువాత, పై ప్లాన్ కింద ఉన్న కస్టమర్లు వారి ఉపయోగాల ప్రకారం సాధారణ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌కు మరలతారు. ఈ ప్లాన్ ద్వారా 10 ఎంబీపీఎస్‌ఎస్ డౌన్ స్పీడ్‌ను,  రోజుకు 5 జీబీ డేటాను అందిస్తుంది బీఎస్ఎన్ఎల్.  ఒకవేళ డేటా పరిమితి అయిపోతే, డేటా వేగం 1 ఎంబీపీఎస్‌కు పరిమితం అవుతుంది. 

దీని ద్వారా ఇంటి నుంచే కిరాణాను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసుకోవడం, లేదా అవసరమైన అవసరాల నిమిత్తం బయటికి వెళ్లాల్సిన అవసరాన్ని తగ్గించుకోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

See Also | కరోనా సాయమట.. నెలకు వెయ్యి రూపాయలు ఇవ్వనున్న యూపీ సీఎం

Related Tags :

Related Posts :