నో మాస్క్ నో ఎంట్రీ, జీహెచ్ఎంసీ ఎన్నికలకు కరోనా గైడ్ లైన్స్ విడుదల చేసిన ఎస్ఈసీ

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

sec release corona guidelines: గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో పాల్గొనే వారికి.. తెలంగాణ ఎలక్షన్‌ కమిషన్‌ కోవిడ్‌ గైడ్‌లైన్స్‌ విడుదల చేసింది. మాస్క్‌ ధరించిన వారికే.. పోలింగ్‌ బూత్‌లోకి అనుమతిస్తామని తెలిపింది. 80 సంవత్సరాల పైబడిన వృద్ధులకు పోస్టల్ బ్యాలెట్, ఈ-విధానం ద్వారా ఓటు హక్కు కల్పించింది. దివ్యాంగులు, ఎన్నికల విధుల్లో పాల్గొనే వారికి సైతం పోస్టల్ బ్యాలెట్ ద్వారానే ఓటు హక్కు వినియోగించుకోవాలి సూచించింది. ప్రతి పోలింగ్ బూత్‌లో శానిటైజర్స్, ఫేస్‌మాస్క్స్, ఫేషియలీడ్స్ అందుబాటులో ఉంచుతామని వెల్లడించింది. కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు విశాలమైన హాల్స్‌లో పోలింగ్‌ బూత్‌లను ఏర్పాటు చేస్తోంది ఎలక్షన్‌ కమిషన్‌. క్యూలో 25మంది కంటే ఎక్కువగా నిలబడకుండా ఉండేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

* మాస్క్ లేకపోతే పోలింగ్ బూత్ లోకి నో ఎంట్రీ
* 80ఏళ్లు పైబడిన వ్యక్తులకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు
* దివ్యాంగులు, ఎన్నికల విధుల్లో పాల్గొనే వారికి పోస్టల్ బ్యాలెట్ అవకాశం
* ప్రతి పోలింగ్ బూత్ లో అందుబాటులో శానిటైజర్, మాస్కులు
* విశాలమైన హాళ్లలో పోలింగ్ బూత్ లు ఏర్పాటు
* ప్రతి ఓటర్ కు మధ్యలో 6 అడుగుల దూరం ఉండేలా ఏర్పాట్లు

గ్రేటర్ హైదరాబాద్‌లో కాంగ్రెస్‌కి కొత్త కష్టం, ఆందోళనలో కేడర్


మోగిన గ్రేటర్ నగారా:
గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికలకు నగారా మోగింది. మంగళవారం(నవంబర్ 17,2020) ఉదయం 10.30 గంటలకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారథి జీహెచ్‌ఎంసీ ఎన్నికల షెడ్యూల్‌ను దాంతోపాటు నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. డిసెంబర్‌ 1న ఓటింగ్‌ నిర్వహించి, డిసెంబర్‌ 4 న కౌంటింగ్‌ చేపడుతామని తెలిపారు. అవసరమైన చోట్ల డిసెంబర్‌ 3న రీ పోలింగ్‌ నిర్వహిస్తామన్నారు. డిసెంబర్ 4న ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది.

రేపటి(నవంబర్ 18,2020) నుంచి డివిజన్ల వారీగా నామినేషన్లు స్వీకరిస్తామని తెలిపారు. నవంబర్‌ 20 నామినేష్ల దాఖలుకు చివరి తేదీ అని, నవంబర్‌ 21 న నామినేషన్ల పరిశీలన ఉంటుందని చెప్పారు. నవంబర్‌ 22న నామినేష్ల ఉపసంహరణకు చివరి తేదీ. డిసెంబర్‌ 6 లోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. మొత్తం 14 రోజుల్లో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుందని ఎన్నికల కమిషనర్ చెప్పారు. బ్యాలెట్‌ పద్ధతిలోనే జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరుగుతాయని పార్థసారథి తెలిపారు. జీహెచ్‌ఎంసీ చట్ట ప్రకారమే 150 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. ఎన్నికల కోడ్ తక్షణమే అమల్లోకి వస్తుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి చెప్పారు.

2016 నాటి రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు:
జీహెచ్‌ఎంసీ మేయర్ పదవిని జనరల్ మహిళకు రిజర్వ్ అయింది. 2016 నాటి రిజర్వేషన్ల ప్రకారమే ఈసారి ఎన్నికలు నిర్వహిస్తున్నామని ఎన్నికల కమిషనర్ పార్ధసారధి చెప్పారు. చట్ట ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. అసెంబ్లీ ఎలక్టోరల్ ప్రకారమే జీహెచ్ఎంసీ ఓటర్ల జాబితా రూపొందించామని, ఈ జాబితాలో మరిన్ని మార్పులు, చేర్పులు ఉంటాయని తెలిపారు. ఇప్పటికే రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించామని చెప్పారు. ఎన్నికలకు భద్రతా ఏర్పాట్లపై డీజీపీ, సీపీలతో సంప్రదింపులు జరిపామని, డీజీపీ కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు. గ్రేటర్ పరిధిలోని 150 డివిజన్లలో ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. ఈ సారికి డివిజన్ల పునర్విభజన లేదన్నారు. బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహిస్తామని, ఏపీ నుంచి కూడా బ్యాలెట్లు తెప్పించామని వెల్లడించారు.

Related Tags :

Related Posts :