రెండో దశ మలబార్‌ విన్యాసాలు ప్రారంభం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Second phase of Malabar exercise begins రెండవ దశ మలబార్‌-2020 నావికదళ విన్యాసాలు ఇవాళ(నవంబర్-17,2020)ఉత్తర అరేబియా సముద్రంలో ప్రారంభమయ్యాయి. భారత్‌ తోపాటు అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియాలకు చెందిన యుద్ధనౌకలు ఇందులో పాల్గొన్నాయి. భారత అమ్ముల పొదిలోని ప్రధాన అస్త్రం ఐఎన్​ఎస్​ విక్రమాదిత్య, అమెరికాకు చెందిన విమాన వాహక నౌక యూఎన్ఎస్​ నిమిట్జ్‌తో పాటు ఆస్ట్రేలియా, జపాన్‌కు చెందిన యుద్ధ నౌకలు ఈ విన్యాసాల్లో పాల్గొన్నాయి.



ప్రపంచంలోనే అతి పెద్ద యుద్ధనౌక యూఎన్​ఎస్​ నిమిట్జ్ ఈ విన్యాసాల్లో పాల్గొనడం ప్రత్యేకంగా నిలుస్తుందని ఓ సీనియర్ అధికారి తెలిపారు. చతుర్భుజ కూటమిలో భాగమైన ఈ నాలుగు దేశాలు సంయుక్తంగా నిర్వహించే ఈ విన్యాసాల వల్ల పరస్పర సమన్వయం పెరుగుతందని భారత నావికాదళం ప్రకటించింది.



కాగా, మలబార్‌ మొదటి దశ విన్యాసాలు ఈ నెల 3- 6 వరకు బంగాళాఖాతంలో జరగగా.. రెండో దశలో జరుగుతున్న ఈ విన్యాసాలు నవంబర్-20,2020 వరకూ కొనసాగనున్నాయి.

Related Tags :

Related Posts :