కరోనా ఫోర్త్ వేవ్ ముంచుకొస్తోంది

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

fourth global Covid-19 wave: కొత్తగా కేసులు పెరుగుతున్నాయి. పోయిందనుకున్నచోట కోవిడ్ మళ్లీ పడగవిప్పుతోంది. చాలా ఐరోపా దేశాల్లో సెకండ్ వేవ్ తో కొత్త కేసులు విరుచుకుపడుతున్నారు. అమెరికాలో సెకండ్ వేవ్ ఉండగానే థర్డ్‌వేవ్ కూడా మొదలైంది. ఇక ఇండియా సంగతి. కరోనా తొలి కెరటం పూర్తికాకముందే సెకండ్ మొదలైందన్నది నిపుణుల మాట.ఫస్ట్‌వేవ్: చైనాలో కంట్రోల్‌
చైనాలో ఫస్ట్‌వేవ్ కేసులు చైనాలో మొదలైయ్యాయి. 2019 డిసెంబర్‌లో తొలిసారి తాము కరోనా వైరస్ బారిన పడ్డామని చైనా బైటపెట్టిననాటి నుంచి తొలి దశ మొదలైనట్లు. ఆనాడు విరుచుకుపడిన కోవిడ్
కేసులను కట్టడిచేసి, కంట్రోలోకి తెచ్చుకుంది చైనా. అంటే, ఫిబ్రవరి చివరికి ఫస్ట్ వేవ్ ముగిసింది. ఆ తర్వాత మార్చిలో యూరోప్ దేశాల్లో సెకండ్‌వేవ్. అంటే చైనా నుంచి వెళ్లిన రోగుల నుంచి స్థానికంగా కరోనా
విజృంభించడం.సెకండ్‌వేవ్‌కి ఇటలీ మొదటి హాట్‌స్పాట్. ఆ తర్వాత స్పెయిన్, జర్మనీ, బ్రిటన్‌లు ప్రపంచ కరోనాకు కేంద్రస్థానాలైయ్యాయి. మేనాటిని అమెరికాని చేజిక్కించుకుంది కరోనా. అక్కడ నుంచి ధర్డ్‌వేవ్ మొదలైనట్లు లెక్కవేస్తున్నారు.

అది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. కేసుల సంఖ్యలో అమెరికాతో పోటీపడింది బ్రెజిల్. ఆగస్ట్ నాటికి ఇండియా పోటీకొచ్చింది. హాట్‌స్పాట్‌గా మారింది.

కరోనా వేవ్ ఎక్కడ నుంచి పుట్టుకొస్తోంది?
థర్డ్ వేవ్ అమెరికాలో అల్లకల్లోలం సృష్టించింది. 50వేలకు తగ్గకుండా గతవారం వరకు అమెరికాలో కేసులు వస్తూనే ఉన్నాయి. సెకండ్ వేవ్ కేసులు తగ్గిన తర్వాత, కరోనా అదుపులోకి వచ్చిందనుకున్న తర్వాతా,
ఒక్కసారి మళ్లీ కొత్తగా కేసులు. కొత్తప్రాంతాలకు వ్యాప్తి చెందుతోంది. ఆగస్ట్‌తో పోలిస్తే మళ్లీ కేసుల సంఖ్యలో పెరుగుదల. సెకండ్‌వేవ్ తగ్గిత తర్వాత ఫ్లోరిడా, టెక్సాస్, కాలిఫోర్నియా రాష్ట్రాల్లో మళ్లీ థర్డ్ వేవ్ ముప్పు
ముంచుకొచ్చింది.ఈ థర్డ్ వేవ్ ఎంత ప్రమాదకరమంటే… కేసుల సంఖ్యలో సెకండ్‌వేవ్‌నే మించిపోవచ్చు.

కరోనా మైల్డ్‌గా వచ్చి వెళ్తోంది. ఏడునెలల తర్వాత అసలు ఎఫెక్ట్ చూపిస్తోంది 


యూరోప్‌లో సెకండ్ వేవ్
శుక్రవారం తొలిసారి యూరోప్‌లో 150,000 కేసులు నమోదవడమంటే ఆల్‌టైమ్ హై. ముందువారమే రోజువారి కేసులు లక్ష దాటగానే, ప్రపంచం అదిరపడింది. Russia, France, Spain, UKల్లో సెకండ్ వేవ్ కేసులు భారీగా నమోదువుతున్నాయి. అందుకే చాలా యూరోప్ దేశాలు లాక్‌డౌన్‌ను పాటిస్తున్నాయి. ఒక వీధివాళ్లు మరో వీధిలోకి అడుగుపెట్టకూడదని నియంత్రణలూ విధించాయి. ఫ్రాన్‌లో శనివారం నుంచి నైట్‌టైం కర్ఫ్యూ.ఇండియా ఫస్ట్‌వేవ్ తగ్గినా, ఇప్పటికీ కేసులు హైయ్యస్ట్
నెలగా ఇండియాలో కొత్త కేసులు తగ్గుతున్నాయి. గ్రాఫ్ నేల చూపు చూస్తోంది. మార్చిలో కేసులు నమోదైననాటి నుంచి కేసులు తగ్గడం ఇదే మొదలు. ఇప్పుడు కేసుల సంఖ్య 60 వేలు. సెప్టెంబర్ మధ్యతో పోలిస్తే 33శాతం తగ్గుదల. జూన్‌ రెండోవారంతో పోలిస్తే కొత్త కేసులు తక్కువే. అంటే ఫస్ట్‌ప్లేస్‌ను ఇండియాకు వదిలిపెట్టిన అమెరికా. మళ్లీ కరోనాకి నెంబర్ వన్ కావడం ఖాయమే.

ఇండియాలో కర్వు తగ్గుతుంటే అమెరికాలో పెరుగుతోంది.

Related Tags :

Related Posts :