లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Political

నలుగురు వైసీపీ రాజ్యసభ సభ్యుల ఎంపిక ఖరారు

నలుగురు వైసీపీ రాజ్యసభ సభ్యుల ఎంపిక దాదాపు ఖరారు అయింది. రాజ్యసభ బరిలో మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమల్ నత్వాని ఉన్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.

Published

on

Selection of four YCP Rajya Sabha members has been finalized

నలుగురు వైసీపీ రాజ్యసభ సభ్యుల ఎంపిక దాదాపు ఖరారు అయింది. రాజ్యసభ బరిలో మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమల్ నత్వాని ఉన్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.

నలుగురు వైసీపీ రాజ్యసభ సభ్యుల ఎంపిక దాదాపు ఖరారు అయింది. రాజ్యసభ బరిలో మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమల్ నత్వాని ఉన్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. సీఎం క్యాంప్ ఆఫీస్ కు సుబ్బిరామిరెడ్డి రావడం ఆసక్తిని కల్గిస్తోంది. వచ్చే నెలతో సుబ్బిరామిరెడ్డి రాజ్యసభ సభ్యత్వం ముగుస్తోంది. ఈ సారి తనకు వైసీపీ నుంచి అవకాశం కల్పించాలని కోరేందుకు ఆయన సీఎం క్యాంప్ ఆఫీస్ కు వచ్చినట్లు ప్రాథమికంగా సమాచారం. 

వైసీపీకి వచ్చే నాలుగు రాజ్యసభ స్థానాలకు సంబంధించి ఎవరికి కేటాయిస్తారనే అంశంపై ఆ పార్టీలో క్లారిటీ వచ్చింది. నలుగురు పేర్లను సీఎం జగన్ దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. వీరిలో ఎమ్మెల్సీలుగా ఉండి ప్రస్తుతం ఎవరైతే మంత్రులుగా ఉన్నారో వారిలో మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ పేర్లు రాజ్యసభకు దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోంది. మరొక స్థానాన్ని ఆ పార్టీ సీనియర్ నేత ఆళ్ల అయోధ్య రామిరెడ్డికి కేటాయిస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది.

నాలుగో స్థానానికి సంబంధించి కొద్ది రోజులుగా వైసీపీలో అంతర్గత చర్చ జరుగుతోంది. ముఖేష్ అంబానీకి సంబంధించిన వ్యక్తి పరిమల నత్వాని రాజ్యసభ సభ్యత్వం పూర్తి అవుతుంది. కొద్ది రోజుల క్రితం పరిమల నత్వాని… సీఎం జగన్ ను కలిసి రాజ్యసభ సీటు కేటాయించాలని కోరారు. పారిశ్రామిక వేత్తల కోటలో పరిమల నత్వానికి కూడా రాజ్యసభ సీటు కేటాయిస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 

ముఖ్యంగా ఇద్దరు బీసీలు, ఒక రెడ్డీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, ఒక పారిశ్రామిక వేత్తకు సంబంధించి నలుగురికీ ఫైనల్ చేసినట్లు సమాచారం. దీనికి సంబంధించి ఇవాళ సాయంత్రం లేదా రేపు అధికారిక ప్రకటన వచ్చే అయ్యే అవకాశం కనిపిస్తోంది. సామాజిక వర్గానికి పెద్ద పీట వేస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బీసీ వర్గానికి పెద్ద పీట వేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.  

మరో కీలక అంశం మండలి రద్దు చేస్తూ అసెంబ్లీ తీర్మానం చేస్తూ కేంద్రానికి పంపిన నేపథ్యంలో మండలి రద్దైనట్లైతే ఇద్దరి మంత్రి పదువులు కూడా పోతాయి కాబట్టి సామాజిక వర్గానికి చెందిన ఆ ఇద్దరు మంత్రులకు న్యాయం చేసే విధంగా జగన్.. రాజ్యసభ సీట్లు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన ఈరోజు సాయంత్రం లేదా రేపు వచ్చే అవకాశం కనిపిస్తోంది. 

See Also | స్థానిక సమరానికి సిద్ధమైన జనసేన: జిల్లాల్లో కీలక నేతలు వీళ్లే!