సెల్ఫీ దిగండి.. గుండె జబ్బు ఉందో లేదో కన్ఫామ్ చేసుకోండి

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

గుండె జబ్బు ఉందో లేదో తెలుసుకోవడానికి డాక్టర్‌కి సెల్ఫీ పంపడం కంటే చీప్ టెక్నిక్ మరొకటి లేదు. కానీ, ఇది సాధ్యపడుతుందా అంటే అవుననే అంటున్నారు చైనా ప్రొఫెసర్ జే జెంగ్. యూరోపియన్‌ హర్ట్‌ జర్నల్‌లో ఈ అంశంపై కథనాన్ని కూడా రాశారు.‘అందుబాటులో ఉన్న టెక్నిక్‌తో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ఇది కనుగొన్నాం. గుండె జబ్బు ఉందో లేదో ముఖం చూసి చెప్పేయొచ్చు. పైగా డాక్టర్ ను నేరుగా కలవకపోయినా ఇది సాధ్యపడుతుంది. డాక్టర్లకు సెల్ఫీ పంపితే వారు ఈ టూల్ ఉపయోగించే ఇట్లే చెప్పేస్తారు. దానిని బట్టి గుండె సమస్యలు ఏవైనా ఉంటే మున్ముందు మరిన్ని టెస్టులుచేయించుకోవాలని సూచిస్తారు. ఒకవేళ అటువంటిదేమీ లేకపోతే ఇక అక్కడితో ఆగిపోవచ్చు’ అని ప్రొఫెసర్ జె జెంగ్ అంటున్నారు.

నేషనల్ సెంటర్ ఫర్ కార్డియోవాస్క్యూలర్ డిసీజెస్ అండ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఫువై హాస్పిటల్ వైస్ డైరక్టర్ జె జెంగ్ రీసెర్చ్ అందరినీ ఆలోచనలో పడేలా చేసింది.‘మా ప్రధానలక్ష్యం ప్రమాదకరమైన జబ్బులు, హై రిస్క్ తో కూడిన సమస్యలు క్లినిక్ కు వెళ్లకుండానే మనకు మనంగానే తెలుసుకునేలా రెడీ చేయడమే. ఈ అప్లికేషన్ చాలా సింపుల్, చీప్, ఎఫెక్టివ్ ఉండాలని అనుకుంటున్నా’ అని ఆయన చెబుతున్నారు.

ముఖాలపై కొన్ని ప్రత్యేకమైన ఫీచర్స్ ద్వారా చెప్పగలుగుతాయట ఆ టూల్స్. గ్రే కలర్ వెంట్రుకలు, చెవి కింద మడుతలు, కళ్ల అంచుల్లో మడుతలు, చర్మంపై పసుపచ్చ రంగులో ఉండే కొవ్వు, కనురెప్పల స్వభావం బట్టి చెప్పే అవకాశం ఉంటుందట.

జింగ్‌ 8 చైనా ఆస్పత్రుల నుంచి 5వేల 796 పేషెంట్ల గుండె పనితీరును అధ్యయనం చేసినట్లు పేర్కొన్నారు.


Related Posts