నటి కుష్బూకు తప్పిన ప్రమాదం.. కారును ఢీకొట్టిన ట్యాంకర్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

film actress Khushboo road accident : సీనియర్ సినీ నటి, బీజేపీ నేత కుష్బూ కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదం నుంచి ఆమె సురక్షితంగా బయటపడ్డారు. ఆమె ప్రయాణిస్తున్న ఓ కారును ట్యాంకర్ ఢీకొట్టింది. కడలూరు వెళ్తుండగా తమిళనాడులోని మెల్ మర్వత్తూర్ దగ్గర కుష్బూ కారును ట్యాంకర్ ఢీకొట్టింది.ప్రాణాపాయం నుంచి ఆమె తృటిలో తప్పించుకున్నారు. తమిళనాడులోని మేల్ మెల్ వత్తూర్ సమీపంలో కుష్బూ ప్రయాణిస్తున్న కారుకు ఓ ట్యాంకర్ అడ్డంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు పక్క భాగం నుజ్జునుజ్జయింది.తనకు ప్రమాదం జరిగిన విషయాన్ని కుష్బూ ప్రకటించారు. ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయట పడినట్లుగా ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. దేవుడి దయ వల్ల తాను సురక్షితంగా ఉన్నానని ఆమె చెప్పారు. ఈ రోడ్డు ప్రమాదం నుంచి తను తృటిలో తప్పించుకున్నానని తెలుపుతూ.. ప్రమాదానికి సంబంధించి ఫొటోల్ని ఆమె షేర్ చేశారు.అందరి అభిమానం, దేవుని ఆశీస్సులతో ఈ ప్రమాదం నుంచి బయటపడ్డానని తెలిపిన కుష్బూ.. ఈ కేసును పోలీసులు సీరియస్ గా దర్యాప్తు చేస్తారని తెలిపారు.

Related Tags :

Related Posts :