Home » ఒకే అడ్రస్ తో 32 మందికి పాస్ పోర్టు..బోధన్ పాస్‌పోర్ట్ స్కా మ్లో సంచలన విషయాలు
Published
3 days agoon
Passport for 32 people with one address : బోధన్ పాస్‌పోర్ట్ స్కా మ్లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గత నెలలో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అరెస్టైన వారిని సైబరాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్న క్రమంలో బయటకొస్తున్న వాస్తవాలు విస్తుగొలుపుతున్నాయి. ఈ కేసులో ఇప్పటికే 8 మందిని అరెస్టు చేయగా, వారిలో ఇద్దరు పోలీసు అధికారులు కూడా ఉన్నారు. గత నెల 25న భారత పాస్‌పోర్టులతో దుబాయ్ వెళ్లేందుకు ప్రయత్నించిన బంగ్లాదేశీయులను పోలీసులు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అరెస్టు చేశారు.
ఎయిర్ పోర్టుకు వచ్చిన సంజీబ్ దత్తా, రామ్‌దాస్, సందీప్‌ను ఇమ్మిగ్రేషన్ అధికారులు ప్రశ్నించినప్పుడు వారు మాట్లాడిన భాష అనుమానాలు కలిగించింది. వారిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా, వారు బంగ్లాదేశీయులని వెల్లడైంది. వీరికి భారత పాస్‌పోర్టులు ఎలా వచ్చాయని తీగ లాగగా డొంకంతా కదిలింది. బోధన్ కేంద్రంగా కుంభకోణం జరుగుతున్నట్టు బయటపడింది. బంగ్లాదేశీయులు వెల్లడించిన వివరాల ఆధారంగా ఎస్సై, ఏఎస్సైని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపామని సైబరాబాద్ సీపీ సజ్జనార్ సోమవారం తెలిపారు.
అరెస్టైన వారిలో ముగ్గురు బంగ్లాదేశీయులు, ఒకరు బెంగాల్‌కు చెందినవారు, ఒకరు పాస్‌పోర్టు ఏజెంట్ అని వివరించా రు. ఇప్పటివరకు 72 మందికి నకిలీ పత్రాల ఆధారంగా పాస్‌పోర్టులు జారీ అయినట్టు గుర్తించామని సీపీ సజ్జనార్ చెప్పారు. వీటిలో ఒకే అడ్రస్ మీద 32 మంది పాస్‌పోర్ట్‌లు పొందారని పేర్కొన్నారు. దీంతో పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ ప్రక్రియపై దృష్టి సారించామని చెప్పారు. నిందితులను విచారిస్తే అన్ని విషయాలు వెల్లడయ్యే అవకాశముందని తెలిపారు.
బంగ్లాదేశీయులకు దుబాయ్ వీసా దొరకడం కష్టంగా మారడంతో వారు దొడ్డిదారిని వెతుక్కుంటున్నారు. ఇందుకు భారత్‌లోని కొందరు ఏజెంట్లు, అధికారులు వారికి సహకరిస్తున్నట్టు తెలిసింది. బంగ్లా నుంచి ఎలాగోలా కోల్‌కతా చేరుకుంటున్న బంగ్లాదేశీయులను నిజామాబాద్ జిల్లాకు తీసుకొచ్చి ఉంచుతున్నారు. ఇక్కడి చిరునామాతోనే వారికి ఆధార్‌కార్డు ఇప్పిస్తున్నారు. ఆ తరువాత ఒక్కో పాస్‌పోర్టుకు రూ.25వేల ఉంచి రూ.50 వేల వరకు ఏజెంట్లు వారి నుంచి వసూలు చేస్తున్నారు.
ఈ క్రమంలో వెరిఫికేషన్‌కు వెళుతున్న స్పెషల్ బ్రాంచ్ ఎస్ఐ మల్లేశ్‌కు రూ.2వేలు, ఏఎస్ఐ అనిల్‌కుమార్‌కు రూ.వెయ్యిచొప్పున ముట్టజెప్తున్నారు. ఈ తతంగం గత రెండేండ్లుగా సాగుతున్నట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అడ్డదారిలో పాస్‌పోర్టులు పొందినవారిలో బంగ్లాదేశీయులు ఉన్నారని, రోహింగ్యాలు లేరని సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు. ఈ కేసు విచారణ కొనసాగుతోందని, ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
డిజిలాకర్‌తో ఎక్కడనుంచైనా పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు..ఒరిజినల్ డాక్యుమెంట్లు అక్కర్లేదు
విశాఖకు స్టీల్‌ప్లాంట్ గుండె వంటిది.. 32 మంది ప్రాణత్యాగాలతో ఏర్పడింది : చంద్రబాబు
పాస్ పోర్ట్ పోగొట్టుకొని..18 ఏళ్లు పాక్ జైల్లో గడిపి..ఎట్టకేలకు భారత్ కు
నిత్యానంద బంపర్ ఆఫర్
భర్త పేరు మీద పాస్‌పోర్ట్ చేయించి ప్రియుడితో ఫారిన్ టూర్.. లాక్డౌన్ పట్టించేసింది..
ఇలాంటి పరిస్థితి వస్తుందనుకోలేదు: అక్షయ్ కుమార్