జీవీకే కేసులో సంచలన విషయాలు..10 డొల్ల కంపెనీలకు రూ.395 కోట్ల నిధులు మళ్లింపు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

జీవీకే కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. జీవీకే 10 డొల్ల కంపెనీలు పెట్టి డబ్బులు మళ్లించినట్లు సీబీఐ గుర్తించినట్లు తెలుస్తోంది. రూ.395 కోట్ల నిధులను వివిధ కంపెనీలకు మళ్లించినట్లు సీబీఐ అధికారులు గుర్తించారు. పది కంపెనీల లావాదేవీలపై ఆరా తీస్తున్నారు. జీవీకే కుటుంబ సభ్యులతోపాటు ఉద్యోగాల పేర్ల మీద కంపెనీలను ఏర్పాట్లు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. తప్పుడు ఇన్ వాయిస్ లతో డబ్బులు బదిలీ చేసినట్లు గుర్తించారు.

పింకిరెడ్డికి చెందిన ఆర్బిటా ట్రావెల్స్ కు పెద్ద మొత్తంలో నిధుల బదలాయింపు జరిగిందన్నారు. ఎయిర్ పోర్టు పక్కనే 200 ఎకరాల్లో డెవలప్ మెంట్ పేరుతో నిధులు బదలాయించారని తెలిపారు. ఈ ప్రాజెక్టులో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదన్నారు. ఐశ్వర్యగిరి కన్ స్ట్రక్షన్ కంపెనీ, కోటియా ఎంటర్ ప్రైజెస్, ఎస్ బీకే ట్రేడ్ ఇన్ ఫ్రాస్ట్రక్షర్, సుభాష్ ఇన్ ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్, అక్వాటెక్ సోల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్, ఓమిని ఇండియా ప్రాజెక్టు, రిచా ఇండస్ట్రీస్, నైస్ ప్రాజెక్టు లిమిటెడ్, అదితి ఇన్ఫో బిల్డ్ సర్వీసెస్ పేరుతో కంపెనీలు ఏర్పాటు చేశారని అధికారులు తెలిపారు.

హైదరాబాద్ లోని బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి జీవీకే పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నట్లు సీబీఐ అధికారులు గుర్తించారు. మనీలాండరింగ్ తోపాటు బోగస్ కంపెనీలు క్రియేట్ చేసి నిధులు పక్క కంపెనీలకు మళ్లించినట్లు ఇప్పటికే సీబీఐ విచారణ వేగవంతం చేసింది. ఈ కేసుకు సంబంధించి కొన్ని అంశాలు కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి. జీవీకే కేసుకు సంబంధించి 10 కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించిన డబ్బులన్నింటిని కూడా 10 డొల్ల కంపెనీలకు మళ్లించినట్లు గుర్తించింది.

10 కంపెనీలకు సంబంధించిన లావా దేవీలు ఏ ఏ సంవత్సరం ఎంత ట్రాన్సాక్షన్ జరిగింది, ఎవరెవరి పేరు మీద ఆ కంపెనీలకు నిధులు వెళ్లాయన్న అంశంపై విచారణ కొనసాగుతోంది. వాటికి సంబంధించి వివరాలను ఆరా తీస్తున్నారు. అయితే తప్పుడు ఇన్ వాయిస్ లతో డబ్బులను బదలాయించినట్లు సీబీఐ గుర్తించింది. విచారణలో పింకిరెడ్డికి చెందిన ఆర్బిటా ట్రావెల్స్ కు పెద్ద మొత్తంలో నిధులు బదలాయించినట్లు గుర్తించింది.

Related Posts