ప్రాణం తీసిన షేర్ చాట్ వీడియో, గొంతు పిసికి చంపేశాడు, శామీర్‌పేటలో బాలుడి మృతి కేసులో ఊహించని ట్విస్ట్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

shamirpet boy death case: హైదరాబాద్‌ శామీర్‌పేటలో బాలుడు అదియాన్‌ మృతికేసు మరో మలుపు తీసుకుంది. అదియాన్ అదృశ్యం కాలేదని తేల్చారు పోలీసులు. మిస్సింగ్‌, కిడ్నాప్‌ అంటూ హంగామా చేసిన యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఔటర్‌ రింగ్‌ రోడ్ సమీపంలో అదియాన్ మృతదేహాన్ని గుర్తించారు. మరోవైపు బాలుడి మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

బాబుని చంపేసి రూ.15లక్షలు డిమాండ్:
బాలుడు అదియాన్‌ టిక్‌టాక్‌కు బాగా అడిక్ట్ అయ్యాడు. ఈ క్రమంలోనే టిక్ టాక్ చేస్తూ ప్రమాదవశాత్తు గాయాలపాలయ్యాడు. బాలుడి కుటుంబసభ్యులకి కాల్ చేసిన బీహార్ యువకుడు అదియాన్ తన దగ్గరే ఉన్నాడని.. అప్పగించాలంటే 15 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. కంగారుపడ్డ కన్నవాళ్లు శామీర్‌పేట పోలీసుల్ని ఆశ్రయించారు. కాల్‌ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

అదియాన్ తల్లిదండ్రులకు కాల్ చేసిన బీహార్ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమదైన స్టయిల్‌లో విచారించడంతో మొత్తం విషయం వెలుగులోకి వచ్చింది. అదియాన్‌ డెడ్‌బాడీ పడేసిన ప్రాంతాన్ని గుర్తించిన పోలీసులు.. స్పాట్‌కు వెళ్లారు.

భయంతో బాబు హత్య:
అదియాన్ ఇంటి పైన రెంట్‌కు ఉండే వ్యక్తే బాలుడిని హత్య చేసినట్టు గుర్తించామని బషీర్ బాగ్ ఏసీపీ నర్సింహారావు తెలిపారు. బాబుతో షేర్ చాట్ వీడియో చేసే సమయంలో.. బాబు తలకు గాయమైందని తెలిపారు. గాయం విషయం తెలిస్తే తల్లిదండ్రులు ఏమైనా అంటారేమో అనే భయంతో బాలుడిని బీహార్ యువకుడు చంపేసినట్లు చెప్పారు. కాల్ లిస్ట్ ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేశామని ఏసీపీ తెలిపారు. అక్టోబర్ 15న నిందితుడు బాబుతో షేర్ చాట్ వీడియో చేశాడు. ఆ సమయంలో బాబు జంప్ చేయడంతో అతడి తలకు గాయమైంది. ఈ విషయం తెలిస్తే అదియాన్ తల్లిదండ్రులు తనను ఏమైనా అంటారేమో అనే భయంతో బీహార్ యువకుడు అదియాన్ ను తన రూమ్ లోకి తీసుకెళ్లి గొంతు పిసికి చంపేశాడు.

సయ్యద్ యూసఫ్, గౌసియా దంపతులకు నలుగురు సంతానం (ఒక పాప, ముగ్గురు బాబులు). వీరిలో అదియాన్ అందరికన్నా చిన్నవాడు. వయసు ఐదేళ్లు. సయ్యద్ యూసఫ్ ఆటో డ్రైవర్ గా పని చేస్తున్నాడు. అదియాన్ మృతితో ఆ ఇంట్లో విషాదం అలుముకుంది. కాగా, ఈ కేసులో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించాలని అదియాన్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

Related Tags :

Related Posts :