sensational video comes out of divya tejaswini

వెలుగులోకి దివ్య తేజస్విని వీడియో, అందులో నాగేంద్ర గురించి సంచలన విషయాలు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

divya tejaswini video: ఏపీలో సంచలనం రేపుతున్న విజయవాడ దివ్య తేజస్విని హత్య కేసులో.. కొత్త కోణం బయటకొచ్చింది. అక్టోబర్ 3న దివ్య తేజస్విని మాట్లాడిన వీడియో ఇప్పుడు బయటకొచ్చింది. ఆ వీడియోలో దివ్య.. సంచలన విషయాలు బయటపెట్టింది. ఓ మహిళ వల్ల తాను మోసపోయినట్లు చెప్పింది. రెండున్నరేళ్ల క్రితం నాగేంద్రతో తాను రిలేషన్‌లో ఉన్నానని.. రెండేళ్ల తర్వాత అతని సైకోయిజం అర్థమైందని చెప్పింది.

అప్పటి నుంచి తన ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ ఉండేవాడని చెప్పింది దివ్య తేజస్విని. కొన్నింటికి.. భయపడి పోలీసులకు ఫిర్యాదు చేయలేకపోయానని చెప్పింది. ఆరు నెలలుగా తాను క్షోభ పడుతున్నానని.. బెదిరింపు కాల్స్, మెసేజెస్ వస్తున్నాయని చెప్పింది. తానొక సైకోతో పోరాడుతున్నానని.. వీడియోలో చెప్పింది దివ్య తేజస్విని. నాగేంద్ర తన కెరీర్ నాశనం చేయాలని చూశాడని.. అన్నింటికీ పోరాడాలనుకుంటున్నానని తెలిపింది.

రంగంలోకి దిశ చట్టం బృందం:
దివ్య కేసుపై దిశ చట్టం బృందం ఫోకస్ చేసింది. తేజస్విని కేసును వీలైనంత త్వరగా దర్యాప్తు పూర్తి చేస్తామని దిశ చట్టం స్పెషల్‌ ఆఫీసర్‌ దీపికా పాటిల్‌ చెప్పారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తామన్నారు. ఈ కేసులో ఇంకా ఎవరైనా ఉంటే వారికీ శిక్ష పడేలా చూస్తామి చెప్పారు. కుటుంబసభ్యులను పరామర్శించిన దిశ చట్టం బృందం వారిని అడిగి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

నేరుగా బెడ్ రూమ్ లోకి దూరి కత్తితో దాడి:
క్రీస్తురాజుపురానికి చెందిన దివ్య తేజస్విని భీమవరంలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ థర్డ్ ఈయర్ చదువుతోంది. కరోనా కారణంగా ఇంట్లోనే ఉంటూ ఆన్‌లైన్‌లో క్లాసులు వింటోంది. ఈ క్రమంలోనే నిన్న(అక్టోబర్ 15,2020) దివ్య ఇంట్లోకి ప్రవేశించిన నాగేంద్ర.. తలుపులన్నీ మూసేశాడు. నేరుగా బెడ్‌రూమ్‌లోకి వెళ్లి దివ్యపై కత్తితో దాడి చేశాడు. ఆపై నాగేంద్ర తనకు తాను గాయం చేసుకున్నాడని దివ్య కుటుంబం ఆరోపిస్తోంది. గాయపడ్డ దివ్యను ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించి చనిపోయింది.

ఏది నిజం?
తేజస్విని ఎవరినీ ప్రేమించలేదంటోంది తల్లి కుసుమ. ప్రేమ జోలికి వెళ్లకుండా ఉమెన్స్ కాలేజీలో చదువుకుంటోందని చెబుతోంది. మరోవైపు నాగేంద్ర మాత్రం మూడేళ్లుగా ప్రేమించుకుని, ఏడాది క్రితమే పెళ్లి చేసుకున్నామని చెబుతున్నాడు. నాగేంద్ర, దివ్య పెళ్లి విషయం నిన్నే తెలిసిందన్నాడు నాగేంద్ర తమ్ముడు నాగరాజు. ఒక వారం నుంచి డల్‌గా ఉంటున్నాడన్నారు. పెళ్లి విషయం ముందే తెలిస్తే ఇంత దారుణం జరిగేది కాదన్నాడు. మరోవైపు హత్య చేయాలని ముందే నాగేంద్ర స్వామి ప్లాన్‌ చేసుకున్నాడని ఆరోపించాడు తేజస్విని తండ్రి. బయటికి వెళ్తే చంపేసిన ఘటనలు విన్నాం కానీ.. ఇంట్లో ఉన్నా కూడా చంపితే ఆడబిడ్డలకు రక్షణేదంటూ తేజస్విని బంధువులు కన్నీరుమున్నీరు అయ్యారు.

READ  జీతం సరిపోలేదేమో : ఆర్మీ అధికారినే లంచం అడిగి దొరికిపోయిన జీహెచ్ఎంసీ ఉద్యోగి

Related Posts