మరో ఇద్దరు తెలుగు సీరియల్ నటులకు కరోనా.. రవికృష్ణ, సాక్షి శివకు పాజిటివ్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

తెలుగు టీవీ పరిశ్రమలో కరోనా కలకలం రేపుతోంది. వరుసగా సీరియల్ నటులు కరోనా బారిన పడుతున్నారు. నిబంధనలు పాటిస్తున్నప్పటికీ పలువురిని వైరస్ అటాక్ చేస్తోంది. తాజాగా ప్రముఖ సీరియల్ నటుడు, బిగ్‌బాస్3తో పాపులర్ అయిన రవికృష్ణ కరోనా బారిన పడ్డాడు. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా రవికృష్ణ స్వయంగా తెలిపాడు. ప్రస్తుతం తాను క్షేమంగా ఉన్నట్లు చెప్పాడు. మూడు రోజులుగా ఎలాంటి లక్షణాలు లేవని స్పష్టం చేశాడు. తనతో కలిసి పని చేసిన వారిని పరీక్షించి చికిత్స అందించాలని రవికృష్ణ కోరాడు. వైర‌స్ వ్యాప్తి తీవ్రంగా ఉన్న ఈ స‌మ‌యంలో ఎవ‌రూ బ‌య‌ట‌కి రావొద్ద‌ని రిక్వెస్ట్ చేశాడు. ర‌వికృష్ణ ప్ర‌స్తుతం ప‌లు సీరియ‌ల్స్‌తో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే.

 

View this post on Instagram

 

A post shared by Rᴀᴠɪ ᴋʀɪsʜɴᴀ (@ravikrishna_official) on


బుల్లితెర నటులపై కరోనా పంజా, జాగ్రత్తలు తీసుకుంటున్నా:
రవికృష్ణతో పాటు టీవీ నటుడు సాక్షి శివకు కూడా కరోనా సోకింది. పలు చానెళ్లలో ప్రసారమవుతున్న అక్క మొగుడు, నెంబర్‌ 1 కోడలు, మౌనరాగం సీరియల్స్‌లో నటిస్తున్న శివకు కోవిడ్‌ పాజిటివ్‌గా తేలడంతో టీవీ పరిశ్రమలో కలకలం రేగింది. బుల్లితెర నటులపై కరోనా పంజా విసురుతోంది. ఇప్పటికే పలువురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. తాజాగా మరో ఇద్దరు నటులు ప్రాణాంతక వైరస్‌ బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది.

 

తలలు పట్టుకున్న నిర్మాతలు:
వరుసగా నటులకు కరోనా సోకుతుండటంతో నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారు. జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్స్ చేస్తున్నా కేసులు పెరుగుతున్నాయని వాపోతున్నారు. ఇప్పటికే ఇద్దరు నటులు సహా ప్రముఖ చానెల్‌లో ప్రసారమవుతున్న ఆమె కథ సీరియల్‌ హీరోయిన్ నవ్య స్వామి సైతం కొవిడ్ బారిన విషయం తెలిసిందే. ఓ వీడియో ద్వారా తనకు కరోనా సోకిన మాట వాస్తవమే అని స్వయంగా నటి నవ్య స్వామి చెప్పింది. నాలుగు రోజులుగా తలనొప్పి, అలసట ఉండటంతో కోవిడ్-19 టెస్ట్ చేయించుకోగా.. పాజిటివ్ అని తేలిందని ఆమె తెలిపింది. ఈ విషయాన్ని చెప్పుకోవడంలో సిగ్గుపడాల్సిన, భయపడాల్సిన పని లేదంది. ప్రస్తుతం పౌష్టికాహారం తీసుకుంటూ సెల్ఫ్ ఇసోలేషన్‌లో ఉంటున్నానని చెప్పింది. అంతకుముందు తనతో కాంటాక్ట్ అయిన వారు ఎలాంటి అనారోగ్య లక్షణాలు కనిపించినా వెంటనే కోవిడ్-19 టెస్ట్ చేయించుకోండని నవ్య స్వామి కోరింది. వరుసగా టీవీ నటులకు కరోనా పాజిటివ్ రావడం బుల్లితెర వర్గాలను కుదిపేస్తోంది. టీవీ పరిశ్రమ వర్గాలను ఆందోళనలో పడేసింది. మూడు నెలల సుదీర్ఘ లాక్ డౌన్ తర్వాత ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో టీవీ, సినిమా షూటింగ్ లు ప్రారంభమయ్యాయి. షూటింగ్స్ కు ప్రభుత్వం గైడ్ లైన్స్ విడుదల చేసింది. ఆ గైడ్ లైన్స్ ప్రకారమే షూటింగ్స్ నిర్వహిస్తున్నారు. అయినా వైరస్ బారిన పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో మరోసారి టీవీ సీరియల్స్ షూటింగ్స్ నిలిచిపోయాయి.

READ  ఇటలీ బీచ్‌‌లో బికినీతో అమీ జాక్సన్ సెక్సీ ఫోజెస్..

Read:సినీ తారలతో జతకట్టిన పవర్‌ఫుల్ పార్టనర్స్

Related Posts