serial killer simhadri crime story

పూజలు, ప్రసాదం పేరుతో 10 హత్యలు : సైనైడ్ సింహాద్రి క్రైమ్ స్టోరీ

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

3 జిల్లాలు, 10 హత్యలు.. బంధువులను కూడా వదల్లేదు.. డబ్బు కోసం హతమార్చే ఓ కిరాతకుడిని ఏపీ పోలీసులు పట్టుకున్నారు. డబ్బున్నవాళ్లనే కాదు… తన బంధువులను

3 జిల్లాలు, 10 హత్యలు.. బంధువులను కూడా వదల్లేదు.. డబ్బు కోసం హతమార్చే ఓ కిరాతకుడిని ఏపీ పోలీసులు పట్టుకున్నారు. డబ్బున్నవాళ్లనే కాదు… తన బంధువులను కూడా అంతం చేశాడు. ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఐదేళ్లలో ఏకంగా 10మందిని చంపేశాడు. క్రైమ్‌ థ్రిల్లర్‌కి ఏమాత్రం తీసిపోని విధంగా రియల్‌ క్రైమ్స్‌ చేసి కటకటాల పాలయ్యాడు. ఎలాంటి ఆయుధం వాడడు, చిన్న గాయం కూడా చెయ్యడు.. ఎంతో నైస్ గా ఎదుటి వ్యక్తి ప్రాణం తీస్తాడు. పూజలు, ప్రసాదం పేరుతో మర్డర్ చేస్తాడు.

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ఎన్టీఆర్ కాలనీకి చెందిన వెల్లంకి సింహాద్రి.. అలియాస్ శివ.. డబ్బు సంపాదించడానికి అడ్డదారిని ఎంచుకున్నాడు. ఈజీ మనీ కోసం క్రైమ్స్ స్టార్ట్‌ చేసి సీరియల్ కిల్లర్‌గా మారాడు. పూజల పేరిట మోసం చేయడం ఇతడి నైజం. మెత్తని మాటలతో సాఫ్ట్‌గా చంపేయడం ఈ కిరాతకుడి స్టైల్‌. తన బంధువులు, పరిచయస్తుల్లో బాగా డబ్బున్న వారిని ఎంచుకుని దగ్గరవుతాడు. పూజల పేరిట తరచూ ప్రసాదాలు ఇస్తూ మాయ చేస్తాడు. ప్రత్యేక పూజలు చేస్తే కోటీశ్వరులు అవుతారని ఊహల పల్లకీ ఎక్కిస్తాడు. 

వారు ఆభరణాలతో ఫంక్షన్లకు వెళ్తున్నప్పుడుగానీ… భారీ మొత్తంలో డబ్బులు తీసుకెళ్లేముందుగానీ వారింట్లో వాలిపోతాడు. అక్కడి నుంచి తన ప్లాన్‌ను పక్కాగా అమలు చేస్తాడు. దేవుడి ప్రసాదమంటూ ఆ ఇంట్లోని వారికి కొంగలను చంపేందుకు ఉపయోగించే విషాన్ని ప్రసాదంలో కలిపేసి ఇస్తాడు. ఆ తర్వాత వారిని ఫాలో అవుతాడు. విషం తిన్నవారు కొంతదూరం ప్రయాణించాక స్పృహ తప్పినా, మృతి చెందినా.. ఆ బంగారం, డబ్బు తీసుకుని ఉడాయిస్తాడు.

ఇలా ఇప్పటివరకు ఏకంగా 10 మందిని చంపేశాడు. ఇటీవల జరిగిన పీఈటీ(వ్యాయామ టీచర్) హత్యతో సింహాద్రి నిజస్వరూపం వెలుగులోకి వచ్చింది. ఏలూరు మండలం లింగారావుగూడానికి చెందిన పీఈటీ నాగరాజు.. 2లక్షల నగదు, నాలుగున్నర కాసుల బంగారు ఆభరణాలతో ఇంటినుంచి బయటికి వెళ్లి.. వట్లూరు పాలిటెక్నికల్ కాలేజీ దగ్గర స్పృహతప్పి పడిపోయారు. ఆస్పత్రికి తరలించినా ఫలితం దక్కలేదు. అయితే.. ఆయన దగ్గర క్యాష్, ఒంటిపై ఆభరణాలు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టిన ఖాకీలకు… నమ్మలేని నిజాలు తెలిశాయి.

విషం వల్ల నాగారాజు చనిపోయినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. దీంతో తీగలాగిన పోలీసులు.. సింహాద్రిని అదుపులోకి తీసుకుని డొంక కదిలించారు. నాగరాజునే కాదు గతంలో ఇలా విషం ఇచ్చి మరో ఏడుగురిని కూడా చంపినట్లు విచారణలో ఒప్పుకున్నాడు ఆ సీరియల్ కిల్లర్. ఇతడి ధన దాహానికి కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాల్లోనూ కొందరు ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించారు పోలీసులు. ఈ కిరాతకుడి చేతుల్లో అంతమైనవారిలో నలుగురు అతడి బంధువులేనని తేలింది.

READ  నటి శ్రావణి కేసులో RX100 నిర్మాత అశోక్ రెడ్డి అరెస్ట్

డబ్బున్నవాళ్లనే కాదు… తన బంధువులను కూడా అంతం చేశాడు సింహాద్రి. ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఐదేళ్లలో ఏకంగా 10మందిని చంపేశాడు. క్రైమ్‌ థ్రిల్లర్‌కి ఏమాత్రం తీసిపోని విథంగా రియల్‌ క్రైమ్స్‌ చేసి కటకటాల పాలయ్యాడు.

పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాల్లో 10 మందిని హతమార్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. రంగురాళ్లు, గుప్తనిధుల పేరుతో పలు ప్రాంతాల్లో మోసాలకు పాల్పడాడు. జనం నుంచి  28 లక్షల రూపాయలకు పైగా కాజేసినట్లు పోలీసులు గుర్తించారు. సింహాద్రితో పాటు సైనేడ్‌ సరఫరా చేసిన షేక్‌ అమీనుల్లాను కూడా పోలీసులు అరెస్ట్‌ చేశారు. సింహాద్రి నుంచి సైనైడ్‌, 23 కాసుల బంగారం, లక్షా 63 వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు.

Related Posts