లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

కోవిడ్ వ్యాక్సిన్ ధర : ప్రభుత్వానికి రూ.300, ప్రవేటుకైతే రూ.1000లు.. సీరమ్ సంస్థ కీలక ప్రకటన

Published

on

Delhi : కరోనా వ్యాక్సిన్ కోసం ప్రజలంతో ఎంతో ఆశతో..ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఈక్రమంలో వ్యాక్సిన్ కూడా వచ్చేసింది. దీంతో ఇక కరోనా కష్టాలు తొలగిపోతాయని ఆశగా ఉన్నారు. ఈక్రమంలో కోవిషీల్డ్ వ్యాక్సిన్ ధరపై సీరమ్ సంస్థ కీలక ప్రకటన చేసింది. ప్రభుత్వానికైతే రూ.300లు, అదే ప్రవేటు సంస్థలకైతే రూ.1000 విక్రయిస్తామని సీరమ్ సంస్థ ఇన్ స్టిట్యూట్ చీఫ్ ఆధార్ పునావాలా ప్రకటించారు.

కాగా..ఈ ఉదయం (జనవరి 12,2021) పూణె నుంచి వ్యాక్సిన్ లోడ్ తో బయలుదేరిన స్పైస్ జెట్ విమానం న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు చేరుకుంది. ఈ విషయాన్ని స్పైస్ జెట్ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది. కరోనా వ్యాక్సిన్ ను రవాణా చేసే అవకాశం తమకు లభించడం గర్వకారణమని..సకాలంలో అన్ని నగరాలకూ టీకాను చేర్చే విషయంలో తాము కట్టుబడివున్నామని వెల్లడించింది.

కాగా..టీకా విమానాశ్రయానికి చేరిందని ఢిల్లీ ఎయిర్ పోర్టు వర్గాలు వెల్లడిస్తూ, హర్షం వ్యక్తం చేశాయి. కరోనా మహమ్మారి దేశంలోకి వచ్చిన తొలినాళ్లలో వైద్య పరికరాలను అన్ని ప్రాంతాలకూ చేర్చేందుకు ఎంతో కృషి చేశామని..టీకాను కూడా అన్ని ప్రాంతాలకూ చేరుస్తామని ఢిల్లీ ఎయిర్ పోర్ట్ సీఈఓ తెలిపారు.

తమ విమానాశ్రయంలో రెండు కార్గో టర్మినల్స్ ను ప్రత్యేకంగా మైనస్ 20 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతను నిర్వహించేలా తయారు చేశామని తెలిపారు. ఎయిర్ పోర్టులో ఉన్నంత వరకూ టీకాలను భద్రంగా నిల్వ చేస్తామని అన్నారు. రోజులో 57 లక్షల టీకా డోస్ లను నిల్వ చేసే సామర్థ్యం ఉందని అన్నారు.

ఇదిలావుండగా, అన్ని రాష్ట్రాలకూ టీకాను చేర్చేందుకు పలు లాజిస్టిక్ సంస్థలు, ఎయిర్ లైన్స్ కంపెనీలు, విమానాశ్రయాలతో కేంద్రం ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేస్తోంది. ఈ తెల్లవారుజామున మూడు ప్రత్యేక ట్రక్కుల ద్వారా పూణె ఎయిర్ పోర్టుకు వ్యాక్సిన్ చేరుకోగా, వాటిని వివిధ నగరాలకు తరలించారు.

దీంట్లో భాగంగా కరోనా వ్యాక్సిన హైదరాబాద్ కు చేరుకుంది. దీంతో వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించేందుకు వ్యవస్థాపరమైన ఏర్పాట్లను సంబంధిత ఉన్నతాధికారులు సమీక్షిస్తున్నారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *