ఎంటర్‌టైన్‌మెంట్ హోం డెలివరీ: OTTలో ఏడు పెద్ద సినిమాలు..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ క‌ల్లోలం సృష్టిస్తోంది. ఈ మహమ్మారి కార‌ణంగా అన్ని వ్య‌వ‌స్థ‌లూ, రంగాలు ఇబ్బందుల‌ను ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా క‌రోనా వైర‌స్ లాక్‌డౌన్ కార‌ణంగా వినోద పరిశ్రమ పూర్తిగా దెబ్బ‌తింది. అయితే అన్‌లాకింగ్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత కూడా మాల్స్, థియేటర్లు తెరుచుకోలేదు. దీనికి అంత‌కంత‌కూ విజృంభిస్తున్న క‌రోనా వ్యాప్తే ప్ర‌ధాన కార‌ణంగా నిలుస్తోంది. గ‌తంలో నిర్మాణం పూర్తిచేసుకున్న బాలీవుడ్ చిత్రాలు లాక్‌డౌన్ కార‌ణంగా విడుద‌ల‌కు నోచుకోలేదు. అయితే ఈ చిత్రాలను ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫారం‌పై విడుదల చేయాలని ఆయా చిత్రాల నిర్మాత‌లు నిర్ణ‌యించారు. ఇది సినీ అభిమానులకు నిజంగా శుభవార్తే. డిస్నీప్లస్, హాట్‌స్టార్‌ల‌లో విడుదల కానున్న బాలీవుడ్ చిత్రాలు ఇవే..

అక్షయ్ కుమార్ నటించిన Laxmmi Bomb.. తెలుగు కామెడీ థ్రిల్లర్ ‘కాంచన’ రీమేక్ ఇది. ఈ చిత్రం ద్వారా లారెన్స్ దర్శకుడిగా హిందీ పరిశ్రమకు పరిచయమవుతున్నాడు.
అజయ్ దేవ్‌గన్, సంజయ్ దత్ నటించిన Bhuj: The Pride of India.. సంజయ్ దత్, పూజా భట్, అలియా భట్, ఆదిత్య రాయ్ కపూర్ తదితరులు నటించిన Sadak 2.. అభిషేక్ బచ్చన్ ప్రధాన పాత్ర పోషించిన The Big Bull.. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ న‌టించిన‌ Dil Bechara, విద్యుత్ జమాల్ Khuda Haafiz, కునాల్ ఖేము, రషిక దుగల్ నటించిన Lootcase.. ఈ చిత్రాలన్నీ నేరుగా OTT లో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయనున్నాయి.

Read:హ్యాపీ బర్త్‌డే నరేష్- ‘నాంది’.. కొత్తగా ట్రై చేశాడు..