చైనాలో మరో వైరస్..ఎంత మంది చనిపోయారో తెలుసా ?

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కరోనా వైరస్ ప్రధాన కేంద్రంగా ఉన్న…చైనా మరోసారి వణికిపోతోంది. మరో వింత వైరస్ వెలుగులోకి వచ్చింది. ఈ వార్త వెలుగులోకి రాగానే..మరోసారి..ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్స్ బున్యా..అనే వైరస్ వ్యాపస్తోందని కనుగొన్నారు. ఈ వింత వైరస్ కారణంగా..ఏడుగురు చనిపోవడం అందర్నీ కలవరపెడుతోంది.మరికొంతమంది వైరస్ బారిన పడ్డారని చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ ఈ విషయాన్ని వెల్లడించింది. నల్లి కీటకాల నుంచి వ్యాప్తి చెందినట్లుగా భావిస్తున్నారు. ఈ వైరస్ కారణంగా..వెంటనే దగ్గు, జ్వరం వచ్చేస్తుందని, మనుషుల నుంచి మనుషులకు నేరుగా కాకుండా..రక్తం లేదా..శ్లేషం ద్వారా వ్యాప్తి చెందుతుందని జిన్జియాంగ్ యూనివర్సిటీ వైద్యులు వెల్లడించారు. తగిన జాగ్రత్తలు పాటిస్తే..ఈ అంటు వ్యాధిపై భయపడాల్సిన అవసరం లేదని ధైర్యం చెబుతున్నారు.

Related Posts