లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న వైద్యురాలుకు తీవ్ర అస్వస్థత

Published

on

Severe illness for physicians vaccinated against corona

illness for lady doctor vaccinated against corona : ప్రకాశం జిల్లా ఒంగోలులోని రిమ్స్ ఆసుపత్రిలో కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న ఓ వైద్యురాలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రిమ్స్‌లో డెంటల్‌ డాక్టర్‌గా పనిచేస్తున్న ధనలక్ష్మి 3 రోజుల క్రితం వ్యాక్సిన్ వేయించుకున్నారు.

ఆ తర్వాత ఆమె తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో… మెరుగైన వైద్యం కోసం చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. కోవిడ్ విధులను విజయవంతంగా నిర్వహించిన డాక్టర్‌ ధనలక్ష్మి గత శనివారం వ్యాక్సిన్‌ వేయించుకున్నారు.

ఆమె అస్వస్థతకు గురైన వెంటనే వైద్యులు అప్రమత్తమయ్యారు. డాక్టర్ ధనలక్ష్మి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని జిల్లా కలెక్టర్ తెలిపారు. వ్యాక్సిన్‌పై ఎలాంటి అపోహలు వద్దన్నారు.