లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Crime

బాలికపై లైంగిక దాడి.. గర్భవతి కావడంతో వెలుగులోకి

Published

on

Sexual assault on a girl : మహబూబాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. వరుసకు బాబాయి అయ్యే వ్యక్తి బాలికపై లైంగిక దాడి చేసి గర్భవతిని చేశాడు. కురవి మండలం గ్రామీణ తండాలో ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు కథనం ప్రకారం.. గ్రామీణ తండాకు చెందిన ఓ బాలిక ఎనిమిదో తరగతి చదువుతోంది. కరోనా లాక్‌డౌన్‌ కావడంతో మార్చి నుంచి ఇంటి వద్దే ఉంటోంది.తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు వెళ్లడంతో ఒంటరిగా ఉన్న బాలికపై ఇంటి పక్కనే ఉన్న వరుసకు బాబాయి అయ్యే హేమ నాయక్‌ కన్నేశాడు. ఆమెను బెదిరించి లైంగికదాడి చేశాడు. విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించడంతో బాలిక భయపడి ఎవరికీ చెప్పలేదు. రెండురోజుల క్రితం బాలిక అనారోగ్యానికి గురికావడంతో బుధవారం తల్లి జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. బాలిక గర్భవతి అని డాక్టర్లు చెప్పడంతో దిగ్భ్రాంతి చెందారు.బాధితురాలిని ప్రభుత్వ ఆస్పత్రికి పంపగా విషయం తెలుసుకున్న బాల రక్షాబంధన్ కోఆర్డినేటర్ జ్యోతి, జిల్లా బాలల పరిరక్షణ అధికారి పుట్ట కమలాకర్ తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. బాలికను వరంగల్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు హాజరు పరిచి, బాలల సంక్షేమ సమితి చైర్మన్ పరశురాములు ఆదేశాల మేరకు రక్షణ కల్పించారు.తల్లిదండ్రుల సమక్షంలో బాలికకు కౌన్సెలింగ్ నిర్వహించగా జరిగిన విషయం చెప్పింది. బాలల సంరక్షణ అధికారులు వీరన్న, నరేశ్‌, ఐసీడీఎస్ సూపర్‌ వహీదా సాయంతో తల్లిదండ్రులు కురవి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *