లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

ఖలిస్తాన్ జెండా కాదు, జెండా ఎగురవేస్తే రూ. 2 కోట్ల బహుమతి!

Published

on

SFJ announces reward : కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపడుతున్న ఆందోళనలు కొత్త మలుపులు చోటు చేసుకుంటున్నాయి. ఢిల్లీలో రిపబ్లిక్ డే రోజున జరిగిన పోరాటాలు..హింసాత్మక మార్గం వైపు మళ్లాయి. దీంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమౌతోంది. ట్రాక్టర్ మార్చ్ నిర్వహిస్తామని చెప్పిన రైతు సంఘాలు…రాజధానిలోకి చొచ్చుకొచ్చాయి. రైతులు రాకుండా ఉండేందుకు ఏర్పాటు చేసిన బారికేడ్లు, బస్సులు, కంటైనర్లు ధ్వంసమయ్యాయి. ఎర్రకోట వైపుకు దూసుకొచ్చిన ఆందోళనల్లో పాల్గొంటున్న కొంతమంది విధ్వంసానికి పాల్పడ్డారు. అంతేగాకుండా..ఎర్రకోటపై రైతు జెండాను ఎగురవేయడం కలకల రేపింది. ఎర్రకోటపైకి ఎక్కిన గుర్తు తెలియని వ్యక్తి జెండా ఎగురవేశాడు.

ఖలిస్తాన్ జెండా ఎగురవేయాలని సిఖ్స్ ఫర్ జస్టిస్ (SFJ) సంస్థ ప్రకటన చేసింది. జెండా ఎగురవేసిన వారికి రూ. 2 కోట్లకు పైగా బహుమతి ఇస్తామని ఆ ప్రకటనలో వెల్లడించింది. ప్రకటించిన విధంగా..మంగళవారం ఇండియా గేట్ వైపు దూసుకెళ్లేందుకు ఆందోళన కారులు యత్నించారు. కుదరకపోవడంతో ఎర్రకోట వైపు వెళ్లి..జెండా ఎగురవేశారు. కానీ…అది ఖలిస్తాన్ జెండా కాదని…దీనికి అనుగుణంగా ఉన్న సిఖ్ మత సంస్థకు చెందిన జెండా అంటూ…సంఘాలు ప్రకటనలు చేశాయి.

ఇండియా గేట్ వద్ద పంజాబ్ ప్రాంతాన్ని ఖలిస్తాన్ పేరిట ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయడమే లక్ష్యంగా…SFJ ( Sikhs for Justice) పని చోస్తోంది. ఈ సంస్థే..రైతు ఉద్యమం పేరిట జరుగుతున్న ఆందోళనలకు నిధులు సమకూరుస్తోందని NIA అధికారులు వెల్లడిస్తున్నారు. SFJ తో సంబంధం ఉన్న..వ్యక్తులపై NIA దర్యాప్తు చేపడుతోంది. ఎర్రకోట దగ్గర జరిగిన హింస వెనుక ఖలిస్తాన్ ఉగ్రవాదుల హస్తం ఉందని..పోలీసులు చెబుతున్నారు. ఈ కేసును NIAకు అప్పచెప్పే అవకాశం ఉంది.