Throwback: తలైవాకు షారుఖ్ సర్‌ప్రైజ్ గిఫ్ట్..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Shah Rukh Khan – Rajinikanth: సౌత్ ఇండియన్ సూపర్‌స్టార్ రజినీకాంత్‌‌ అంటే బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్‌కు చాలా అభిమానం.. ఈ ఇద్దరు సూపర్‌స్టార్స్ కలిసి ఫుల్‌ లెంగ్త్‌ సినిమా అయితే చేయలేదు కానీ షారుఖ్ Ra.One సినిమాలో రజినీ అతిథి పాత్రలో మెరిశారు. వీరిద్దరూ కలిసి వెండితెరపై నటించడం అప్పట్లో పెద్ద సెన్సేషనల్‌ అయ్యింది.


ఈ సినిమాలో రజినీకాంత్‌ ఓ చిన్న పాత్రలో నటించడంపై కింగ్ ఖాన్ చాలా హ్యాపీగా ఫీలవడమే కాకుండా, కృతజ్ఞతగా ఆయనకు ఖరీదైన బీఎండబ్ల్యు 7 సిరీస్‌ కార్ గిఫ్ట్‌గా ఇచ్చారట. కేవలం రజినీకాంత్‌కే కాదు. చిత్ర దర్శకుడు అనుభవ్‌ సిన్హా, విలన్ పాత్రలో అద్భుతంగా నటించిన అర్జున్‌ రాంపాల్‌లకు కూడా షారుఖ్ ఖరీదైన కార్లను బహుమతిగా ఇచ్చారట.

Rajinikanth - Shah Rukh Khan

ఆ తర్వాత షారుఖ్, దీపికా పదుకొణే నటించిన ‘చెన్నై ఎక్స్‌ప్రెస్‌’ లోనూ రజినీకాంత్‌పై లుంగీ డ్యాన్స్‌ అనే సాంగ్‌ చేసి మరోసారి తన అభిమానాన్ని చాటుకున్నారు షారుఖ్. ఈ పాటతో పాటుగా స్టెప్స్ కూడా ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయ్యాయి.


Related Posts