లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

యంగ్ క్రికెటర్ల కోసం ద్రవిడ్‌ను ఆదర్శంగా తీసుకోవాలి: అఫ్రీది

Updated On - 11:21 am, Sun, 17 January 21

SHAHID AFRIDI: పాకిస్తాన్ క్రికెట్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రీది.. ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీ హెడ్ గా వ్యవహరిస్తున్న రాహుల్ ద్రవిడ్ గురించి మాట్లాడారు. కఠినంగా శ్రమించి అండర్-19 లెవల్ ఇండియన్ ప్లేయర్లను తీర్చిదిద్దిన ద్రవిడ్ అడుగు జాడల్లో నడవాలంటూ పాకిస్తాన్ యంగ్ క్రికెటర్లకు సూచించారు.

లాహోర్ లో జరిగిన ఓ ఫంక్షన్లో మాట్లాడిన ఆయన మాజీ క్రికెటర్ల గొప్పదనం గురించి ప్రస్తావిస్తూ.. ద్రవిడ్ లాంటి వ్యక్తి అడుగుజాడల్లో నడవాలని అన్నారు. ప్రస్తుతం ఇండియా అండర్-19, ఇండియా ఏ టీమ్ లకు కోచ్ గా వ్యవహరిస్తున్న ద్రవిడ్.. నేషనల్ క్రికెట్ అకాడమీ హెడ్ గా కార్యకలాపాలు కొనసాగిస్తూ కఠిన శ్రమతోనే అండర్ 19 లెవల్ ప్లేయర్లను రెడీ చేశారు.

‘నాకు తెలిసి మన దగ్గర టాలెంట్ కొరత ఉన్నట్లు కనిపిస్తుంది. మాజీ క్రికెటర్లు, దిగ్గజాల నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఇంజమామ్ ఉల్ హఖ్, యూనిస్ ఖాన్, మొహమ్మద్ యూసఫ్ లు పాకిస్తాన్ యంగ్ క్రికెటింగ్ టాలెంట్ కు పదును పెట్టారు.

నేను క్రికెట్ ఆడే రోజుల్లో కూడా బౌలర్లకు కోచ్ లకు మధ్య సరిపడేది కాదు. వఖర్‌తో నా సమస్యలను క్లియర్‌గా చెప్పా. ఇలా చేయడం వల్లే బోర్డు ఓపెన్ గా విని దీని గురించి చర్చిస్తుందని అన్నారు. రీసెంట్ గా ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైర్ అయిన అమీర్.. ప్రజెంట్ మేనేజ్మెంట్ మారితేనే కానీ, తన నిర్ణయం వెనక్కు తీసుకోనని స్పష్టం చేశాడు.

ఇదిలా ఉంటే అమీర్ మరోసారి పీసీబీతో మాట్లాడి.. జట్టులో లెఫ్ట్ ఆర్మ్ ఫేసర్ లోటును భర్తీ చేయాలంటూ చెబుతున్నాడు. పాకిస్తాన్ హెడ్ కోచ్ మిస్బాను విమర్శిస్తూ ఇంటర్నేషన్ క్రికెటర్ అయ్యే వ్యక్తి టాప్ లెవల్‌లో చికెన్ హార్ట్‌తో ఉంటే సరిపోదు. ప్లేయర్లు అగ్రెసివ్ గా ఆడాలంటే ఎంకరేజ్‌మెంట్ చాలా అవసరం. అప్పుడే మంచి ఫలితాలు వస్తాయి’ అని వెల్లడించారు.