లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Sports

షాహిద్ అఫ్రీదికి కరోనా పాజిటివ్

Published

on

Shahid Afridi tests positive for Covid-19

పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రీదికి కరోనా పాజిటివ్ అని తేలింది. స్టార్ క్రికెటర్లలో కరోనా వచ్చిన తొలి వ్యక్తి అఫ్రాదినే ‘నాకు గురువారం నుంచి అనారోగ్యంగా అనిపిస్తుంది. ఒళ్లు నొప్పులుగా అనిపిస్తుండటంతో టెస్టులకు వెళ్లాను. దురదృష్టవశాత్తు కొవిడ్ పాజిటివ్ అని వచ్చింది. వెంటనే కోలుకోవడానికి మీ ప్రార్థనలు కావాలి. ఇన్షా అల్లాహ్’ అని ట్విట్టర్ లో పోస్టు చేశాడు. 

1996లో అంతర్జాతీయ క్రికెట్ లో అరంగ్రేటం చేసిన అఫ్రీది 2018వరకూ కెరీర్ కొనసాగించాడు. 27టెస్టుల్లో (1716పరుగులు, 48వికెట్లు), 398వన్డేల్లో (8వేల 64పరుగులు, 395వికెట్లు), 99టీ20ల్లో (1416పరుగులు, 98వికెట్లు) సాధించాడు. మార్చి నెలలో జరిగిన పాకిస్తాన్ సూపర్ లీగ్ మ్యాచ్ లో ఆఖరి సారిగా కనిపించాడు అఫ్రీది. 

కరోనా వైరస్ బారిన పడి నష్టపోయిన వారికి అతని ఛారిటీ పేరిట సర్వీస్ చేస్తూనే వస్తున్నాడు. సోషల్ మీడియా వేదికగా అఫ్రీది త్వరగా కోలుకోవాలని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మరో పాకిస్తాన్ క్రికెటర్ తౌఫిక్ ఉమర్ కు కూడా పాజిటివ్ వచ్చింది. కానీ, ఈ నెలలోనే అతను రికవరీ అయ్యాడు. 

పాకిస్తాన్ లెగ్ స్పిన్నర్ రియాజ్ షేక్ తో పాటు మరో ప్లేయర్ కరోనా ఇన్ఫెక్షన్ తో చనిపోయారు. జాఫర్ సర్ఫరాజ్ అనే ఫస్ట్ క్లాస్ ప్లేయర్ ఏప్రిల్ నెలలో చనిపోయారు. 

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *