లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

‘‘కార్పోరేటర్’’ గా షకలక శంకర్!

Published

on

Shakalaka Shankar: స్టార్ కమెడియన్ షకలక శంకర్ పాలిటిక్స్ లోకి వస్తున్నాడా ఏంటి, అని ఆశ్చర్యపోతున్నారా.. అదేం కాదు.. శంకర్ నటిస్తున్న సినిమా టైటిల్ ‘కార్పోరేటర్’.  సంజయ్ పూనూరి ని దర్శకుడిగా పరిచయం చేస్తూ.. సమీప మూవీస్-ఎయు అండ్ ఐ స్టూడియోస్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.


ఎ.పద్మనాభరెడ్డి నిర్మాతగా, డాక్టర్ ఎస్.వి.మాధురి సహ నిర్మాతగా రూపొందుతున్న ఈ చిత్రం రెండు పాటలు మినహా షూటింగ్ పూర్తి చేసుకుంది.

లవ్లీ కపుల్.. చై-సామ్ బ్యాక్!


Coporatorకార్పోరేషన్ ఎలక్షన్స్ బ్యాక్‌డ్రాప్‌లో.. 5 పాటలు – 4 ఫైట్స్ కలిగిన రెగ్యులర్ ఫార్మాట్‌లోనే వినోదానికి పెద్ద పీట వేస్తూ తెరకెక్కిస్తున్నామని, ఈ చిత్రంలో అంతర్లీనంగా ఒక మంచి సందేశం ఉంటుందని, శంకర్ పెర్ఫార్మెన్స్ ‘కార్పోరేటర్’ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని దర్శకుడు డాక్టర్ సంజయ్ చెబుతున్నారు.


శంకర్ సరసన సునీత పాండే, లావణ్య శర్మ, కస్తూరి హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి యాక్షన్: వింగ్ చున్ అంజి, డ్యాన్స్: సూర్యకిరణ్- వెంకట్ దీప్, ఎడిటింగ్: శివ శర్వాణి, కెమెరా: జగదీష్ కొమరి, సంగీతం: ఎం.ఎల్.పి.రాజా, సహ నిర్మాత: డాక్టర్ ఎస్.వి.మాధురి, నిర్మాత: ఎ.పద్మనాభరెడ్డి,
కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: సంజయ్ పూనూరి.Shakalaka Shankar

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *