లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

నా బాయ్‌ఫ్రెండ్స్ మారుతూ ఉంటారు.. మా అమ్మే నన్ను హోటల్‌కి పంపించింది.. షకీలా బోల్డ్ & షాకింగ్ కామెంట్స్..

Published

on

Shakeela: షకీలా.. తన అంద చందాలతో కుర్రకారుని కవ్వించడమే కాక దక్షిణాదిన సెక్స్ బాంబ్ గా పాపులర్ అయ్యింది. మలయాళంలో ఆమె సినిమా రిలీజ్ అవుతుందంటే.. స్టార్ హీరోలు తమ సినిమాలను వాయిదా వేసుకునే వారంటే.. షకీలా క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

అయితే తెరమీద లగ్జరీగా కనిపించే నటీనటుల జీవితాల్లో తెరవెనుక ఎంతటి విషాదం నెలకొని ఉంటుందనేది కొత్తగా చెప్పక్కర్లేదు. డబ్బుల విషయంలో సొంత వారి చేత మోసపోవడం.. ప్రేమ, పెళ్లి పేరుతో నమ్మించి పలువురు మగాళ్లు మోసం చేయడం వంటివి షకీలా జీవితంలో చాలానే ఉన్నాయి.

తాజాగా కామెడీ కింగ్ ఆలీ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న పాపులర్ షో కు షకీలా, ఒకప్పుడు ఐటెం సాంగ్స్‌తో ప్రేక్షకులను అలరించిన అనురాధతో కలిసి పాల్గొన్నారు. ఈ షో లో తన పర్సనల్ లైఫ్‌కి సంబంధించిన పలు అంశాలను కుండబద్దలు కొట్టినట్లు తన స్టైల్‌లో కాస్త బోల్డ్‌గానే చెప్పారు షకీలా.

ఫైనాన్షియల్‌గా హ్యాపీయా మీరు అని ఆలీ అడగ్గా.. నేను సంపాదిస్తున్నాను.. తింటున్నాను.. నో బ్యాంక్ బ్యాలెన్స్.. నథింగ్.. అని చెప్పిన షకీలా.. పెళ్లి గురించి అడగితే.. అవన్నీ ఎందుకండీ.. అని దాటవేస్తే.. అనురాధ, షకీలా బాయ్ ఫ్రెండ్స్ మారిపోతూ ఉంటారని చెప్పారు.

మా అమ్మ చనిపోయిన తర్వాత ఇతనే మన లైఫ్ అనుకన్నాను.. పెళ్లి రొక్కా మీద పేర్లు రాసే టైంలో తాగేసి వచ్చి.. నువ్వు సిగరెట్ మానేస్తేనే చేసుకుంటానని చెప్పాడు.. ఒక హ్యాంగర్ తీసి బాగా కొట్టాను.. ఇప్పటికీ నా ఎక్స్‌ బాయ్‌ఫ్రెండ్స్ అందరూ ఇప్పటికీ నాతో మాట్లాడతారు.. అన్నారు..

అలాగే మహానటి సావిత్రి గురించి కూడా చెప్పిన షకీలా.. తన తల్లి గురించి, తను రాసిన ఆటో బయోగ్రఫీ గురంచి పలు షాకింగ్ విషయాలు వెల్లడించారు. షకీలా, అనురాధ కలిసి పాల్గొన్న ఈ షో ప్రోమో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

Shakeela