shakeelas-ladies-not-allowed-movie-release-through-www-ladiesnotallowed-com

సెన్సార్ కాకుండానే షకీలా సినిమా రిలీజవుతుంది.. మసాలా మిస్ కాకండి.. టికెట్ రూ.50 మాత్రమే..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

నటి షకీలా సమర్పణలో సాయి రామ్‌ దాసరి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘లేడీస్‌ నాట్‌ ఎలౌడ్‌’. రమేష్‌ కావలి నిర్మిస్తున్నారు. విక్రాంత్‌ రెడ్డి సహ నిర్మాత. దర్శకుడు సాయి రామ్ దాసరి తెరకెకించిన అడల్ట్ కామెడీ హారర్ సినిమా ఇది. సెన్సార్ వివాదంతో గడిచిన సంవత్సర కాలంగా థియేటర్ రిలీజ్‌కి నోచుకోలేని ఈ సినిమా ఇప్పుడు నేరుగా ఆన్ లైన్‌లో విడుదల కానుంది. జూలై 20న www.ladiesnotallowed.com అనే వెబ్‌సైట్‌లో ‘లేడీస్‌ నాట్‌ ఎలౌడ్‌’ చిత్రం విడుదల కానుంది.. సినిమా చూసేందుకు రూ.50 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని చిత్ర బృందం తెలిపింది.

Shakeela

వివరాలు లోకి వెళ్తే.. తొలి ప్రైవేట్ పాటతోనే కాంట్రవర్సీ దర్శకుడిగా పేరు తెచ్చుకొని.. తొలి సినిమా నుండి తీసిన ప్రతి సినిమాతో ఏదో ఒక వివాదం సృష్టిస్తూ.. వివాదాలకు కేరాఫ్ అడ్రెస్‌గా మారిన సాయి రామ్ దాసరి గత సంవత్సరం ప్రముఖ నటి షకీలా సమర్పణలో ‘లేడీస్ నాట్ అలౌడ్’ అనే సినిమాను తెరకెకించారు. కానీ.. సెన్సార్ ఆ సినిమాకు సర్టిఫికెట్ ఇవ్వలేదు. ఈ వివాదాన్ని ఆయన ఢిల్లీ వరకు తీసుకెళ్లారు. కరోనా కారణంగా ఆ వివాదం ఇప్పటికీ పరిష్కారం కాలేదు. మరో ఇప్పట్లో సినిమా హాల్స్ తెరుచుకునే అవకాశం కూడా లేకపోవడంతో సినిమాను నేరుగా ఆన్‌లైన్‌లో విడుదల చేసేందుకు చిత్ర బృందం నిర్ణయించుకుంది.

Shakeela's Ladies Not Allowed

ఇప్పటికే అందరూ ఓటీటీలలో సినిమాలు విడుదల చేస్తుంటే.. రొటీన్‌గా చేస్తే ఏముంది అనుకున్నారో ఏమో గాని తొలిసారిగా తెలుగు చిత్ర పరిశ్రమలో సినిమాకు ఒక వెబ్‌సైట్ ఏర్పాటు చేసి నేరుగా అందులో చిత్రాన్ని విడుదల చేయనున్నారు. సినిమా చూసేందుకు ప్రేక్షకులు రూ.50 చెల్లించాల్సి ఉంటుంది. ఈ సినిమాను జూలై 20న రాత్రి ఎనిమిది గంటలకు విడుదల చేస్తున్నట్లు దర్శకుడు సాయి రామ్ దాసరి తెలిపారు. ఈ వారం సినిమాను ప్రమోట్ చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లు షకీలా తెలిపారు. ఈ సినిమాను కావాలి రమేష్, విక్రాంత్ రెడ్డి, షకీలా సంయుక్తంగా నిర్మించారు. శ్రీ మిత్ర సంగీతం అందించగా.. తరుణ్ కరంథోద్ సినిమాటోగ్రఫీ చేశారు. కె.ఆర్.స్వామి ఎడిటర్.

Related Posts