లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

స్నేహితురాలితో శర్వా పెళ్లి!..

Published

on

కరోనా లాక్‌డౌన్ కాలంలో టాలీవుడ్‌లో పెళ్లి బాజాలు మోగుతున్నాయి. గత నాలుగు నెలలుగా ఇళ్లకే పరిమితమైన యంగ్ హీరోస్ అండ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ అందరూ ప్రొషెషనల్ లైఫ్‌కి బ్రేక్ రావడంతో పర్సనల్ లైఫ్‌పై ఫోకస్ పెట్టారు. ఒక్కొక్కరుగా ఓ ఇంటివారయిపోతున్నారు. నితిన్, రానా దగ్గుబాటి ఇటీవలే పెళ్లిళ్లు చేసుకున్నారు. ఈ లిస్టులో తాజాగా శర్వానంద్ కూడా చేరబోతున్నాడు.



శర్వా తన చిన్ననాటి స్నేహితురాలిని పెళ్లాడబోతున్నాడని మీడియా, సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. శర్వా చేసుకోబోయే ఆ ఫ్రెండ్ మహిళా పారిశ్రామికవేత్త అని బిజినెస్ రంగంలో ఇప్పటికే ఆమె యువ మహిళా వ్యాపారవేత్తగా గుర్తింపు తెచ్చుకున్నారని తెలుస్తోంది.



గత 16 ఏళ్లుగా సినీ పరిశ్రమలో కెరీర్ కొనసాగిస్తున్న శర్వా వయసు 36 సంవత్సరాలు.. ఇంట్లో పెళ్లి ప్రస్తావన తేవడంతో తన మనసులో మాట బయటపెట్టి ఇరు కుటుంబాల వారిని ఒప్పించాడట. సినిమాల విషయానికొస్తే.. త్వరలో విడుదల కానున్న ‘శ్రీకారం’తో పాటు కిషోర్ తిరుమల, అజయ్ భూపతి దర్శకత్వంలోనూ సినిమాలు చేయనున్నాడు శర్వానంద్.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *