లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

ఫ్రాన్స్ కి రాజ్ నాథ్…రాఫెల్ కి ఆయుధపూజ

Published

on

Shastra Puja" In Paris, Sortie For Rajnath Singh During Rafale Handover

భారత వైమానిక దళం తరఫున దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న 36 రాఫెల్ యుద్ధ విమానాలలో మొదటిదాన్ని స్వీకరించడానికి ఫ్రాన్స్‌కు బయలుదేరే గంట ముందు…భారత్ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఓ ట్వీట్ చేశారు. భారతదేశం-ఫ్రాన్స్ సంబంధాలను సరికొత్త స్థాయికి తీసుకెళ్లాలని ఎదురుచూస్తున్నట్లు ట్వీట్ లో తెలిపారు. భారత్-ఫ్రాన్స్ ద్వైపాక్షిక సంబంధాలు ఇటీవలి సంవత్సరాలలో విపరీతమైన పురోగతి సాధించాయి. ఈ సంబంధాలను మరింతగా మరియు మరింతగా పెంచుకోవాలని ఎదురుచూస్తున్నామని ఆ ట్వీట్ లో తెలిపారు.

మూడు రోజుల ఫ్రాన్స్ పర్యటన కోసం ఇవాళ(అక్టోబర్-7,2019)రాజ్ నాథ్ పారిస్ బయలుదేరిన విషయం తెలిసిందే. రాఫెల్.. యాన్యువల్ ఢిఫెన్స్ డైలాగ్ అండ్ ఇండక్షన్ వేడుకకు రాజ్ నాథ్ హాజరుకానున్నారు. ఫ్రెంచ్ సాయుధ దళాల మంత్రి ఫ్లోరెన్స్ పార్లీతో కలిసి మెరిగ్నాక్‌లో జరిగే రాఫెల్ ఫైటర్ జెట్ హ్యాండ్-ఓవర్ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లేముందు మంగళవారం(అక్టోబర్-8,2019) ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో రాజ్ నాథ్ సమావేశమవుతారు. 

అయితే అదే రోజు, విజయదశమి శుభ సందర్భంగా.. రాఫెల్ యుద్ధ విమానంలో ఒక దానిని అందునేముందు ఆయుధ పూజ చేయనున్నారు రాజ్ నాథ్. విజయదశమి రోజున హిందువులు ఆయుధపూజ నిర్వహిస్తారన్న విషయం తెలిసిందే. RB-01 నెంబర్ గల రాఫెల్ కి రాజ్ నాథ్ ఆయుధ పూజ చేయనున్నట్లు సమాచారం.
 

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *