Home » 10tvతో శ్రిఖా చౌదరి : రాకేష్ రెడ్డి అబద్దాలు చెబుతాడు
Published
2 years agoon
By
madhuహైదరాబాద్ : ప్రముఖ పారిశ్రామిక వేత్త, ప్రవాస భారతీయుడు చిగురుపాటి జయరాం మర్డర్ కేసులో నిందితుడిగా ఉన్న రాకేష్ రెడ్డి అన్నీ అబద్దాలే చెబుతాడని శ్రిఖా చౌదరి వెల్లడించారు. రాకేష్ రెడ్డితో ఉన్న రిలేషన్‌షిప్‌పై శ్రిఖా స్పందించారు. మర్డర్ మిస్టరీలో శ్రిఖా పాత్ర ఉందని ప్రచారం జరుగుతుండడంతో 10tv ఆమెతో ముచ్చటించింది. జయరాం..రాకేష్ రెడ్డి..ఇతరత్రా విషయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
2017లో రాకేష్ రెడ్డి పరిచయం అయ్యాడని..టెట్రాన్ కంపెనీలో కొన్ని సమస్యలు వచ్చాయని…దీనిని పరిష్కరించాలని జయరాం సూచించినట్లు తెలిపారు. దీనిపై ప్రభుత్వం..ఇతరుల సహాయంతో సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేసినట్లు తెలిపారు. సెటిల్ మెంట్ విషయంలో చెక్కులు ఇచ్చారని..కానీ కొన్ని డబ్బులు జయరాం ఇవ్వలేకపోయారని వివరించారు. సెటిల్ మెంట్ జరుగుతున్న సందర్భంలో రాకేష్ రెడ్డి…జోక్యం చేసుకుని కొంత సమస్య పరిష్కరించే ప్రయత్నం చేసినట్లు పేర్కొన్నారు.
ఆరేడు నెలల నుండి రాకేష్‌తో పరిచయం ఉందని తెలిపిన శ్రిఖా…తరువాత అతను అన్నీ అబద్దాలు చెబుతాడని గుర్తించినట్లు పేర్కొన్నారు. 9 నెలల నుండి రాకేష్‌ను కలవలేదని…ఏమీ చేస్తున్నాడో తెలియదన్నారు. అతడిని వ్యవహార శైలి గురించి అప్పట్లోనే జయరాంకు చెప్పినట్లు తెలిపారు. రాకేష్ రెడ్డి తనను పెళ్లి చేసుకుందామని అనుకొని ఉండవచ్చని అయితే తాను మాత్రం అతడిని పెళ్లి చేసుకొనే ఆలోచన లేదన్నారు. రాకేష్ రెడ్డితో జయరాంకు పరిచయం ఉందనే విషయం తనకు నిజంగా తెలియదని శ్రిఖా తెలిపారు.