Shikhar Dhawan Feeds "Hungry Animals" With Family, Harbhajan Singh, Kuldeep Yadav Applaud Batsman

కొడుకుకు నిజమైన విలువలు నేర్పుతున్నానంటోన్న ధావన్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

టీమిండియా ఓపెనర్ శిఖర ధావన్.. ఇనిస్టాగ్రామ్ లో ఓ స్టోరీ పంచుకున్నాడు. కొడుకు జోరావేర్, భార్య ఆయేషాతో కలిసి రోడ్డుపై వెళుతూ మధ్యలో కారు ఆపేసి రోడ్డు పక్కనే ఉన్న జంతువులకు ఆహరం పెడుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ వీడియోను పోస్టు చేస్తూ.. తన కొడుక్కి జీవితంలో నిజమైన విలువలు నేర్పుతున్నట్లు రాసుకొచ్చాడు. 

ఈ పరీక్షా సమయంలో తనతో పాటు తన ఫ్యాన్స్ కూడా ఇలాంటి పనులు చేయాలని సూచించాడు. ‘ఓ తండ్రిగా కొడుకుకు నిజమైన విలువలు నేర్పించడం చాలా ముఖ్యం. ఇతరులతో జాలిగా మెలగడం, అవసరం ఉన్న వాళ్లకు సాయం చేయడం కూడా అంతే ముఖ్యం. ఇలాంటి క్లిష్ట సమయంలో ఆకలితో ఉన్న జంతువులకు ఆహారం పెట్టడం చాలా ముఖ్యం. అటువంటి ముఖ్యమైన పాఠాలను నా కొడుకుకు నేర్పుతున్నా. ప్రతి ఒక్కరూ వాళ్లకు తోచినంత సాయం చేయండి’ అంటూ ఇనిస్టాగ్రామ్ లో పోస్టు చేశాడు. 

ఈ వీడియోపై స్పందించింది టీమిండియా క్రికెటర్లలో మొదటిగా వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్. ”శభాష్ జట్టా” అంటూ కామెంట్ చేసి హార్ట్ ఎమోజీ పోస్టు చేశాడు. దీనిపై లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా ఓ హార్ట్ ఎమోజీతో కాంప్లిమెంట్ ఇచ్చాడు. 

 

 

ఇటీవలే ధావన్ తన పార్టనర్ రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్ తో కలిసి బీసీసీఐ టీవలో ఓపెన్ నెట్స్ విత్ మయాంక్ అనే టీవీ షోలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా తాను 2013లో మొహాలీ వేదికగా అరంగ్రేటం చేసిన టెస్టు మ్యాచ్ లో 85 డెలివరీల్లోనే సెంచరీ చేసిన సంగతి గుర్తు చేసుకున్నాడు. మయాంక్ అగర్వాల్ తో అది నా బెస్ట్ పర్‌ఫార్మెన్స్ అని చెప్పాడు. 

గేమ్ దశను మార్చగలిగే తక్కువ మంది క్రికెటర్లలో ధావన్ ఒకరు. సోషల్ మీడియాలో చాలా తక్కువ యాక్టివ్ గా ఉండే శిఖర్.. కొద్ది రోజుల క్రితం కొడుకుకు హెయిర్ కట్ చేస్తున్న వీడియో ఒకటి పోస్టు చేశాడు. 

Related Posts