లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

ఎస్పీ బాలుకు పద్మవిభూషణ్..తమిళనాడు కోటాలో ప్రకటించిన కేంద్రం

Published

on

SP Balasubrahmanyam గాన గాంధర్వుడు, దివంగత ఎస్పీ బాలసుబ్రమణ్యానికి(SPB)కి అరుదైన గౌరవం దక్కింది. బాలుకి దేశంలోనే రెండవ అత్యున్నత పూర పురస్కారం “పద్మ విభూషణ్‌” అవార్డును కేంద్రం ప్రకటించింది. రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్రం ఈ అవార్డులను ప్రకటించింది. అయితే బాల సుబ్రమణ్యానికి తమిళనాడు కోటాలో అవార్డును అందించింది. జపాన్ ప్రధాని షింబో అబేకి కూడా పద్మభూషణ్ అవార్డుని ప్రకటించింది కేంద్రం.

భారత అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మ పురస్కారాలను సోమవారం కేంద్రం ప్రకటించింది. ఈ ఏడాదికి గాను పద్మ విభూషణ్‌-7 , పద్మభూషణ్‌-10 , పద్మ శ్రీ-102 ఇలా మొత్తం 119 మంది వివిధ రంగాలకు చెందిన వారు పద్మ పురస్కారాలకు ఎంపికయ్యారు. మరో ప్రముఖ గాయిని కే.ఎస్ చిత్రకు ప్రభుత్వం పద్మ భూషణ్ అవార్డు అందించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. కేంద్ర మాజీ మంత్రి రాం విలాస్ పాశ్వాన్‌, అస్సాం మాజీ ముఖ్యమంత్రి తరుణ్‌ గొగొయ్‌, మాజీ లోక్ సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్, గుజరాత్‌ బీజేపీ నేత కేశూభాయ్‌ కు కేంద్రం పద్మభూషణ్‌ ప్రకటించింది.