Shiv Sena authorises Uddhav to take final call on govt formation

ఏం జరుగుతోంది : శివసేన ఎమ్మెల్యేలు హోటల్ కి తరలింపు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటులో ప్రతిష్టంభన కంటిన్యూ అవుతోంది. అసెంబ్లీ గడువు నవంబర్ 9 తో ముగియనున్న సంగతి తెలిసిందే. దీంతో పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. తమ

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటులో ప్రతిష్టంభన కంటిన్యూ అవుతోంది. అసెంబ్లీ గడువు నవంబర్ 9 తో ముగియనున్న సంగతి తెలిసిందే. దీంతో పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. తమ పార్టీ ఎమ్మెల్యేలను శివసేన కాపాడుకునే పనిలో పడింది. రిసార్ట్ రాజకీయాలకు తెరలేపింది. శివసేన తన ఎమ్మెల్యేలను బాంద్రాలోని ఓ హోటల్ కి తరలించింది. శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే ఇంటికి సమీపంలోనే ఈ హోటల్ ఉంటుంది.

మరోవైపు శివసేన ఎమ్మెల్యే ఆ పార్టీ అధినేత ఉద్ధవ్ థాక్రే నివాసం మాత్రోశ్రీలో గురువారం(నవంబర్ 7,2019) సమావేశమయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి తుది నిర్ణయం తీసుకునే అధికారం ఉద్ధవ్ దేనంటూ తీర్మానించారు. ఈ విషయాన్ని ఆ పార్టీ ఎమ్మెల్యే దేశాయ్ తెలిపారు.

కాగా, సీఎం పదవిని చెరిసగం పంచుకోవాలని కొన్ని రోజులుగా శివసేన పట్టుబడుతూ వస్తోంది. దీనికి బీజేపీ నో చెబుతోంది. దీంతో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో బీజేపీ-శివసేన మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించిన సేనకు ఎన్సీపీ రూపంలో ఎదురుదెబ్బ తగిలింది. ప్రతిపక్షంలోనే కూర్చుంటామని, కలిసొచ్చేది లేదని ఆ పార్టీ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో శివసేన కాస్త వెనక్కి తగ్గినట్లు కనిపించినా.. గురువారం తన పంతం వీడేది లేదని మరోసారి స్పష్టం చేసింది. ఈ క్రమంలో పార్టీ ఎమ్మెల్యేలు ఫిరాయించకుండా ముందు జాగ్రత్తగా హోటల్ కి తరలించింది.

Related Posts