లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

ఫడ్నవీస్ భార్య వ్యాఖ్యలకు శివసేన దిమ్మతిరిగే కౌంటర్

Published

on

Shiv Sena hit out at Amruta Fadnavis మ‌హారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవీస్ పై శివసేన పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. శివసేనపై అమృత ఫడ్నవీస్ చేసిన వ్యాఖ్యల తీవ్ర దుమారం రేపుతున్న నేపథ్యంలో అమృత ఫడ్నవీస్ కి స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. ఎదుటివారిపై విమ‌ర్శ‌లు చేసేట‌ప్పుడు కొన్ని హ‌ద్దులు ఉండాల‌ని అమృతని శివసేన హెచ్చ‌రించింది. వ‌ర్ణ‌మాలలోని ప్రతి అక్షరం చాలా విలువైనదని, ఆ అక్ష‌రాల‌ను స‌రిగ్గా వినియోగించడం నేర్చుకోవాల‌ని సూచించింది.కాగా, గురువారం శివ‌సేన‌పై విమ‌ర్శ‌లు చేసిన అమృత‌.. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ పేలవమైన ప్రదర్శన చేసిందని విమ‌ర్శించింది. అంతేగాక ‘శివసేనలో ‘ఐ’ తీసేసి ‘ఏ’ చేరిస్తే శవసేన అవుతుందని అమృత ఫడ్నవీస్ వ్యాఖ్యానించారు. ఆమె వ్యాఖ్యలకు శివసేన అంతేస్థాయిల్ కౌంటర్ ఇచ్చింది.అమృత ఫడ్నవీస్ ని ఉద్దేశించి…నీ పేరులో నుంచి ‘ఏ’ అనే అక్షరాన్ని ఎట్టి పరిస్థితుల్లో తీసెయ్యకు. ఒక వేళ దాన్ని తీసేస్తే నీ పేరు ‘మృత’ అవుతుంది. బతికి ఉన్న నీకు ఆ పేరు అంత బాగుండ‌దు. నువ్వు ఇంకో విషయం తెలుసుకోవాలి. వర్ణమాలలోని ప్రతి అక్షరం విలువైనదే. అయితే దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలిసి ఉండాలి. దీపావళి పండగపూట ఇలాంటి చెడు వ్యాఖ్యలు చేయకండి అని శివ‌సేన‌ చురకలు అంటించింది.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *