లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

భోపాల్ గ్యాస్​ విషాదం…36 ఏళ్ల తర్వాత స్మారకం ప్రకటించిన సీఎం

Published

on

memorial for Bhopal gas tragedy victims భోపాల్​ గ్యాస్​ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారి జ్ఞాపకార్థం ఓ స్మారక చిహ్నం నిర్మించనున్నట్లు మధ్యప్రదేశ్​ సీఎం శివరాజ్​ సింగ్​ చౌహాన్​ ప్రకటించారు. ప్రపంచంలోని ఏ నగరమూ మరో భోపాల్​లా మారకూడదని ఈ స్మారకం గుర్తుచేస్తుందని ఆయన అన్నారు. అయితే,భోపాల్​ గ్యాస్​ విషాద ఘటన జరిగిన సరిగ్గా 36 ఏళ్లకు ఆయన ఈ ప్రకటన చేశారు.1984 భోపాల్​ గ్యాస్​ దుర్ఘటన జరిగి నేటికి 36 ఏళ్లు. ఈ సందర్భంగా మృతులకు సీఎం చౌహాన్ నివాళి అర్పించారు. అప్పటి ప్రమాదంలో తమ భర్తలను కోల్పోయిన మహిళలకు రూ.1000 చొప్పున పింఛను ఇచ్చే పథకాన్ని తిరిగి ప్రారంభిస్తామని చౌహాన్ ప్రకటించారు శివరాజ్.2019లో కాంగ్రెస్​ హయాంలో వితంతువులకు పింఛను నిలిపివేశారని… దానిని పునరుద్ధరిస్తామని సీఎం చౌహాన్ తెలిపారు. మరోవైపు,ఈ చీకటి రోజున బాధితులు, వారి కుటుంబసభ్యులు భోపాల్​లో నిరసనలు చేశారు.భోపాల్​ దుర్ఘటనలో మిథైల్​ ఐసోసైనేట్​ రసాయనం వెలువడి 15 వేలమందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 5 లక్షలమందికిపైగా తీవ్రంగా ప్రభావితమయ్యారు. వీరిలో చాలా మంది ఇప్పుడు కరోనా కారణంగా చనిపోతున్నారు. భోపాల్ ​లో కరోనాతో ఇప్పటివరకు 518 మంది మరణించగా.. అందులో 102 మంది భోపాల్ గ్యాస్​ దుర్ఘటన బాధితులే ఉన్నారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *