మద్యం మత్తులో కూతురిపై అత్యాచార యత్నం చేసిన తండ్రి

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

తాగుడు మనిషిని ఎంతటి పతనానికైనా దిగజారుస్తుంది. తాగిన మైకంలో తప్పులు చేసిన కామాంధులు ఎందరో ఉన్నారు. హర్యానాలో తాగిన మైకంలో స్నేహితుడితో కలిసి కన్నకూతురిపై అత్యాచారం చేయబోయిన తండ్రి ఉదంతం ఆలస్యంగా వెలుగు చూసింది. సినిమా కధలాగా అనిపించినా ఇది వాస్తవం.

హర్యానాలోని రోహ్ తక్ లో నివసించే ఒక వ్యక్తి సెప్టెంబర్ 1వ తేదీ రాత్రి తన స్నేహితుడితో కలిసి ఇంట్లో మద్యం సేవించాడు. ఇంట్లో అందరూ నిద్రపోతున్నారు. అయినా స్నేహితులు ఇద్దరూ పీకల దాకా తాగారు. తెచ్చుకున్న మద్యం అయిపోయింది.

ఇక నిద్రపోవటానికి లేచారు. పక్కనే ఉన్న గదిలోకి వెళ్లారు. ఆగదిలో అతడి కుమార్తె(12) నిద్రిస్తోంది. మద్యం తలకెక్కిన తండ్రికి కూతురు పై కన్నుపడింది. తన రక్తం పంచుకు పుట్టిన బిడ్డ అనే సంగతి మర్చిపోయాడు.స్నేహితుడితో కలిసి బాలికపై అత్యాచారం చేయబోయాడు. నిద్రపోతున్న బాలిక స్పృహ లోకి వచ్చి వెంటనే గట్టిగా కేకేలు వేసింది.

కూతురు అరుపులు విని వేరే గదిలో పడుకున్న తల్లి పరుగున వచ్చింది. కూతురిపై అత్యాచారం చేయబోతున్న భర్తను, అతడిస్నేహితుడిని ఇవతలకు లాగిపారేసింది. బాలికను రక్షించి వేరే గదిలోకి పంపించింది. మర్నాడు ఉదయం రోహ్ తక్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడైన తండ్రి, అతని స్నేహితుడిపై ఐపీసీ సెక్షన్ కింద, పోక్సో కింద కేసులు నమోదు చేశారు. సెప్టెంబర్3వ తేదీ గురువారం కోర్టులో హజరు పరిచి జ్యూడీషియల్ కస్టడీకి పంపారు.

Related Posts