Shocking! Only 15% of Indian students with overseas medical degrees become eligible to practise in India

వైద్య విద్యార్థులకు షాకింగ్ : విదేశాల్లో డాక్టర్ డిగ్రీ.. ఇండియాలో ప్రాక్టీస్ కష్టమే!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

విదేశాల్లో మెడికల్ కోర్సు చదవాలని ప్రతిఒక్కరూ కోరుకుంటారు. విదేశాల్లో డాక్టర్ పూర్తి చేసి స్వదేశంలో ప్రాక్టీస్ ప్రారంభించాలని భావిస్తుంటారు. అందుకే చాలామంది భారతీయ విద్యార్థులు స్వదేశంలో కంటే విదేశాల్లోనే వైద్య విద్య కోసం పరుగులు పెడుతుంటారు. ప్రత్యేకించి ఇండియా నుంచి విదేశాల్లో వైద్యవిద్య కోసం పోటీపడే వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. వైద్య విద్యను విజయవంతంగా పూర్తి చేసుకుని ఇండియాకు తిరిగివచ్చేవారి సంఖ్య తగ్గిపోతోంది. దీనికి అసలు కారణం ఇండియాలో మెడికల్ ప్రాక్టీస్ పెట్టాలంటే కచ్చితంగా ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఎగ్జామినేషన్ (FMGE) టెస్టులో అర్హత సాధించాల్సి ఉంటుంది.

15 శాతం మాత్రమే అర్హత : 
ఇండియాలో ప్రాక్టీస్ పెట్టాలనుకునే వైద్యవిద్య విద్యార్థులు కచ్చితంగా FMGE టెస్టు పూర్తి చేయడం తప్పనిసరి. కానీ, ఈ టెస్టును భారతీయ వైద్య విద్యార్థులు 15శాతం మాత్రమే పూర్తి చేసి అర్హత సాధిస్తున్నట్టు ఓ రిపోర్టు తెలిపింది. ఈ టెస్టులో అర్హత సాధించలేని వైద్య విద్యార్థుల్లో గరిష్టంగా బంగ్లాదేశ్, మార్టిట్యూస్ నుంచి వచ్చిన విద్యార్థులే ఉన్నట్టు తెలిపింది. ఈ రెండు దేశాల నుంచే ఎక్కువ మంది విద్యార్థులు వైద్య విద్య కోసం విదేశాలకు వెళ్తున్నట్టు రిపోర్టు పేర్కొంది. 

నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్స్ విశ్లేషణ ప్రకారం.. FMGE నిర్వహించిన 2015, 2018 మెడికల్ టెస్టులో 61వేల 708 మంది భారతీయ విద్యార్థులు మెడికల్ డిగ్రీలు పొందినట్టు వెల్లడించింది. అంటే.. 14.2 శాతం లేదా 8వేల 764 మంది విద్యార్థులు మాత్రమే FMGE టెస్టులో పాస్ అయ్యారు. ఇతర దేశాలైన చైనా, రష్యా, ఉక్రేయిన్ ల్లో ఉత్తీర్ణత రేటుతో సమానంగా ఉన్నాయి.

మరోవైపు చైనా, రష్యా, బంగ్లాదేశ్, ఉక్రేయిన్, నేపాల్ కైర్జిస్థాన్, కజికిస్థాన్ ఏడు దేశాల నుంచి గరిష్టంగా FMGE టెస్టుకు విద్యార్థులు హాజరయ్యారు. ఈ వ్యవధిలో 87.6శాతం లేదా 54వేల 055 మంది విద్యార్థులు ఉన్నట్టు రిపోర్టు తెలిపింది. డేటా ప్రకారం.. మార్టిట్యూస్ నుంచి FMGE టెస్టుకు హజరైన 154 మంది విద్యార్థుల్లో 81మంది మాత్రమే 52శాతంతో పాస్ అయ్యారు. బంగ్లాదేశ్, నేపాల్ నుంచి వరుసగా 1,265 మందిలో 343 మంది 27.11 శాతం లేదా 5వేల 894 మందిలో 1,042 మంది మాత్రమే FMGE టెస్టులో అర్హత సాధించారు. 

సక్సెస్ రేటు సాధించిన విద్యార్థులు ఎక్కువమంది చైనా, రష్యా, ఉక్రేయిన్ నుంచి (2,370/20,314) వరుస గణాంకాల్లో 11.67శాతం, 12.89శాతం, 15శాతంగా ఉన్నారు. అందుకే.. విదేశాల్లో వైద్యవిద్యను అభ్యసించాలని భావించే విద్యార్థులు ముందుగా తాము ఎంచుకునే విద్యాసంస్థల విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

READ  అంతర్జాతీయ క్రికెట్‌కు టీమిండియా స్పిన్నర్ రిటైర్మెంట్

ఇండియాలో మొత్తంగా 77వేల ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఇండియాలో ఎంబీబీఎస్ సీట్లు లక్షకు పైగా పెరుగుతాయని భావిస్తున్నట్టు నీతి అయోగ్ సభ్యులు డాక్టర్ వినోద్ పాల్ తెలిపారు. మిగతా దేశాల్లో మాత్రమే కాకుండా సౌదీ అరేబియా, గయానా, లిబియా, కేమ్యాన్ దీవులు, పాకిస్థాన్ వంటి దేశాల్లో కూడా భారతీయ విద్యార్థులు ఎంబీబీఎస్ కోర్సులను చదువుతున్నారు. 

Related Posts