షాకింగ్ వీడియో: ఈ బుడ్డోడు వయసు రెండేళ్లు.. రైలు కింద పడి బతికాడు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

చిన్నపిల్లలు చాలా కొంటెగా ఉంటారు.. కొన్నిసార్లు చిన్న పొరపాటే వారిని పెద్ద ప్రమాదాలలో పడేస్తుంది. అటువంటి ఓ చర్యే ఊహించని పరిణామం.. రైలు పట్టాలపై ఓ బుడతడికి జరిగింది. ఢిల్లీ సమీపంలోని ఫరీదాబాద్‌ ప్రాంతానికి చెందిన బల్లబ్‌ఘడ్‌ రైల్వే స్టేషన్‌ పరిధిలో రైలు పట్టాలపై ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

తను నడుపుతున్న రైలు ముందు ఓ రెండేళ్ల బుడ్డోడు పడటాన్ని గమనించిన రైలు డ్రైవరు వెంటనే ఎమర్జెన్సీ బ్రేక్‌ వేసి ఆపాడు. అయితే అప్పటికే రైలు కొంత దూరం ప్రయాణించింది. ఏ ఘోరం చూడాల్సి వస్తుందో అని ఆందోళనగా దిగిన డ్రైవర్.. ఆ బాలుడు ఒంటి మీద కనీసం ఓ చిన్న దెబ్బ కూడా లేకుండా కనిపించడంతో ఊపిరి పీల్చుకున్నారు డ్రైవర్లు.కాగా ఆ చిన్నారిని అతని అన్నయ్యే రైలు కిందకి తోసేశాడని తెలిసింది. ఆ బుడతడి ఆయుష్షు గట్టిది కాబట్టి బతకడం సాధ్యమైంది కానీ.. లేకుంటే అతను బతకటం అసంభవమని ఈ సంఘటన చూసిన వారు అంటున్నారు. తనతో ఉన్న మరో డ్రైవర్‌, ఇతరుల సహాయంతో ఇంజిన్‌ కింద ఇరుక్కున్న ఆ బాలుడిని బయటకు తెచ్చి వారి తల్లికి అప్పగించారు.

కాగా, ఆ గూడ్స్‌ రైలు డ్రైవర్‌ జరిగిన సంఘటన అంతా లిఖిత పూర్వకంగా పై అధికారులకు వివరించారు డ్రైవర్లు. ఆ సమయంలో విధుల్లో ఉన్న ఇద్దరు డ్రైవర్లకు రైల్వే ఉన్నతాధికారులు బహుమతి ప్రకటించారు.
A #video of a 2-year-old child #stuck under the #engine of a #goods #train on #delhi#Agra railway track after he was thrown by a 13-year-old boy goes viral. The little boy had a #miraculous #escape. @spgrpagra @upgrp_hq pic.twitter.com/4G0yUHQmvS

— Anuja Jaiswal (@anujajTOI) September 23, 2020Related Posts