లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

హాస్పిటల్‌లో శవంతో వీధికుక్క చెలగాటం

Published

on

UP Stray Dog: ఉత్తరప్రదేశ్‌లోని గవర్నమెంట్ హాస్పిటల్ లో ఓ వీధి కుక్క వీరంగం చేసింది. సిబ్బంది ఎవరూ పట్టించుకోకపోవడంతో మృతదేహాన్ని పళ్లతో పీకుతూ కాసేపటి వరకూ విచ్చలవిడిగా చేసింది. సంభాల్ జిల్లాలో జరిగిన ఘటనపై అధికారులు కాస్త లేటుగా స్పందించారు. గురువారం రోడ్ యాక్సిడెంట్ లో గాయపడిన బాలికను హాస్పిటల్ కు తీసుకువచ్చారు.

అప్పటికీ ఆమె మృతి చెందినట్లు కన్ఫామ్ చేయలేదు. ఆమెపై తెల్లని వస్త్రం కప్పి ఉంచారు. అదే సమయంలో సిబ్బంది అక్కడ లేకపోవడంతో వీధికుక్క స్ట్రెచర్ మీద కాళ్లు పెట్టి గుడ్డలో ముఖం పెట్టి ఆమె శరీరాన్ని పళ్లతో పీకుతూ కనిపించింది.బాధితురాలి కుటుంబం హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్యాన్ని బ్లేమ్ చేస్తున్నారు. వీధి కుక్కలోనికి ఎలా వచ్చిందని ప్రశ్నిస్తున్నారు. ‘దాదాపు 1.5గంటల పాటు ఎవరూ పట్టించుకోలేదు. ఇది పూర్తిగా హాస్పిటల్ నిర్లక్ష్యం’ అని బాధితురాలి తండ్రి చరణ్ సింగ్ అంటున్నారు.

స్థానిక అధికారులకు సమచారం ఇచ్చామని, వాళ్లెటువంటి యాక్షన్ తీసుకోలేదని హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ చెప్పింది. ఈ విషయంలో తమను నిందించవద్దని చీఫ్ మెడికల్ సూపరిండెంట్ ఆఫ్ ద హాస్పిటల్ చెప్తున్నారు.

ఫార్మాలిటీస్ పూర్తయ్యాక కుటుంబ సభ్యులు ఎటువంటి అటాప్సీ అవసరం లేదని చెప్పడంతో మృతదేహాన్ని అప్పగించారు. ఏ ఒక్క క్షణమో పట్టించుకోకపోవడంతో అలా జరిగి ఉండొచ్చని డా.సుశీల్ వర్మ వెల్లడించారు.

ఈ ఘటనను సమాజ్‌వాదీ పార్టీ ప్రముఖ సోషల్ మీడియా మాద్యమం ట్విట్టర్ ద్వారా షేర్ చేసింది. కమిటీ దీనిపై విచారణ జరిపి సిబ్బందిని సస్పెండ్ చేసింది.

ఇన్వెస్టిగేషన్‌లో స్వీపర్, వార్డ్ బాయ్ రెస్పాన్సిబుల్ అని తెలిసింది. చాలా మృతదేహాలను డీల్ చేయాల్సి ఉంది. అయినా వారిని సస్పెండ్ చేశాం. డాక్టర్, ఫార్మాసిస్ట్ ల నుంచి వివరణ కోరాం. దీనిపై ఇన్వెస్టిగేట్ చేయడానికి కమిటీ ఏర్పాటు చేశాం’ అని హాస్పిటల్ అఫీషియల్ చెప్పారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *