shraddha-kapoor-accepted-green-india-challenge-from-prabhas1

ప్రభాస్ ఛాలెంజ్ స్వీకరించిన శ్రద్ధా కపూర్..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ShraddhaKapoor accepted Green india Challenge: రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన మూడో విడత గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం మహా అద్భుతంగా కొనసాగుతుంది. దీనిలో పాల్గొని మొక్కలు నాటడానికి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ముందుకు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని, ఇందుకు శ్రీకారం చుట్టిన సంతోష్ కుమార్ కు అభినందనలు తెలియజేయడం జరుగుతుంది.


యువరాజా ఈసారైనా హిట్ కొడతాడా?..


‘బాహుబలి’, ‘రెబల్ స్టార్’ ప్రభాస్ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి ఈరోజు ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ బొంబాయిలోని తన నివాసంలో మొక్కలు నాటి ఈ విషయాన్ని తన సామాజిక మాధ్యమం ఫేస్ బుక్ ద్వారా తెలియజేయడం జరిగింది. ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు తీసుకెళ్తున్న రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు శ్రద్ధా కపూర్.


Related Posts