లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Sports

వామ్మో శ్రేయాస్: టీ20ల్లో టాప్ స్కోర్.. 55 బంతుల్లో 15 సిక్సులు

Published

on

Shreyas iyer made t20s highest score record

భారత క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్ షార్ట్ ఫార్మాట్ టీ20ల్లో రెచ్చిపోయాడు. టీమిండియా క్రికెటర్లందరి కంటే అత్యధిక వ్యక్తిగత స్కోరు బాదేసి రికార్డు నమోదు చేశాడు. సయ్యద ముస్తఖ్ అలీ ట్రోఫీ 2019లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో సిక్కిం జట్టుపై చెలరేగిపోయాడు. ముంబై జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రేయాస్.. ఓపెనర్లు విఫలమైన వేళ అన్నీ తానై జట్టును నడిపించాడు. 

కెప్టెన్ రహానె(11), పృథ్వీ షా(10)లు ఇన్నింగ్స్‌ను పేలవంగా ఆరంభించారు. మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన శ్రేయాస్ 55 బంతుల్లోనే 147పరుగులు చేశాడు. 4 ఫోర్లు, 6 సిక్సులు  సాయంతో ముంబై స్కోరును పరుగులు పెట్టించాడు. జట్టు 22 పరుగుల వద్ద బ్యాటింగ్‌కు దిగిన శ్రేయాస్.. సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి 200పరుగులకు మించిన భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. 

క్రీజులో దిగినప్పటి నుంచి సిక్కిం జట్టుపై ఆధిపత్యాన్ని చెలాయిస్తూ పరుగులను దండుకున్నాడు. అయ్యర్ వేగవంతమైన పరుగులతో టీ20లలో పంత్ పేరిట ఉన్న అత్యధిక పరుగుల వ్యక్తిగత రికార్డు బద్దలైంది. గతేడాది ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరపున ఆడిన రిషబ్ పంత్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 128పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇప్పుడు అదే ఫార్మాట్‌లో పంత్.. సిక్సింపై 147 పరుగులు చేసి పాత రికార్డులన్నీ తుడిచిపెట్టేశాడు. 

టీ20ల్లో భారత బ్యాట్స్‌మెన్ వ్యక్తిగత రికార్డులిలా:
1. శ్రేయాస్ అయ్యర్-147(ముంబై vs సిక్సిం, సయ్యద్ ముస్తఖ్ అలీ ట్రోఫీ 2019)
2. రిషబ్ పంత్-128(ఢిల్లీ డేర్‌డెవిల్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్, IPL 2018)
3. మురళీ విజయ్-127(చెన్నై సూపర్ కింగ్స్ vs రాజస్థాన్ రాయల్స్, IPL 2010)
4. సురేశ్ రైనా-126(ఉత్తరప్రదేశ్ vs బెంగాల్, సయ్యద్ ముస్తఖ్ అలీ ట్రోఫీ 2018)
5. వీరేందర్ సెహ్వాగ్-122( కింగ్స్ ఎలెవన్ పంజాబ్ vs చెన్నై సూపర్ కింగ్స్, IPL 2014) 

టీమిండియా క్రికెట్‌లో తక్కువగా అవకాశాలు అందిపుచ్చుకుంటున్న శ్రేయాస్.. ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ ప్రత్యేకతను చూపుతున్నాడు.  

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *