గోల్డెన్ మాస్క్‌లో ధగ ధగ!..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

లాక్‌‌డౌన్ సమయంలో తన సోషల్ మీడియా ఖాతాల్లో రోజుకో కొత్త ఫొటో పోస్ట్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటోంది హీరోయిన్ కమ్ మ్యుజీషియన్ శ్రుతి హాసన్. ఇటీవల వరుసగా వెడ్డింగ్ లుక్ ఫొటోలను షేర్ చేస్తోంది. అదే తరహాలో తాజాగా మరో ఫొటోను శ్రుతి అభిమానులతో పంచుకుంది.Shruti Haasan

ఇటీవల ఓ మేగజీన్ కవర్ పేజీపై శ్రుతి మెరిసింది. బ్లాక్ డ్రెస్, దానిపైన బంగారు గొలుసులు, ఆపై గోల్డెన్ మాస్క్ ధరించి సరికొత్త లుక్‌లో శ్రుతి చూపరులను ఆకట్టుకుంది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ మాస్క్‌లు ధరించడం గురించి సెలబ్రిటీలు అవగాహన కలిగిస్తున్నారు.ఈ నేపథ్యంలోనే శ్రుతి గోల్డెన్ మాస్క్ ధరించి ఫొటో షూట్‌లో పాల్గొంది. ఇది ఎప్పటికీ తన ఫేవరెట్ కవర్ పేజ్ అని పేర్కొంటూ సదరు మ్యాగజైన్‌కు థ్యాంక్స్ తెలిపింది శృతి. తెలుగులో మాస్ మహారాజా రవితేజ ‘క్రాక్’తో పాటు, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ ‘వకీల్ సాబ్’ సినిమాలు చేస్తుంది శృతి హాసన్..
Related Posts